Vijaya Bharathi: ప్రముఖ రచయిత్రి విజయభారతి కన్నుమూత
అనారోగ్యంతో గత కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆమె హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో తుదిశ్వాస విడిచారు.
తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలులో ఆమె జన్మించారు. తెలుగు రచయిత్రిగా సుప్రసిద్ధురాలు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆమె ఎంఏ తెలుగు లిటరేచర్, అనంతరం పీహెచ్‌డీ చేశారు. తెలుగు సాహిత్యం, చరిత్ర, సామాజిక అంశాలకు సంబంధించి 20కి పైగా పుస్తకాలను రచించారు. ముఖ్యంగా ఆమె మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేడ్కర్ జీవిత చరిత్రలను తన పుస్తకాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించారు.
ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగం అధిపతిగా కూడా వ్యవహరించారు. 2005లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 2015లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నేషనల్ అవార్డులు ఆమెకు దక్కాయి.
Sitaram Yechury: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత