Sitaram Yechury: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత
కొంతకాలంగా ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ కారణంగా చికిత్స పొందుతున్న ఆయన సెప్టెంబర్ 12వ తేదీ తుదిశ్వాస విడిచారు.
సీతారాం ఏచూరి 1952, ఆగస్టు 12వ తేదీ మద్రాసులో స్థిరపడిన తెలుగు కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి ఏచూరి సర్వేశ్వర సోమయాజి, తల్లి ఏచూరి కల్పకం. ఏచూరి మొదటి భార్య ఇంద్రాణి మజుందార్. జర్నలిస్టు సీమా చిశ్తీని రెండో భార్య. ఆయనకు ముగ్గురు సంతానం.
బాల్యం మొత్తం హైదరాబాద్‌లో గడిపారు. హైదరాబాద్‌లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్‌లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. తండ్రి సర్వేశ్వర సోమయాజి ఏపీఎస్ ఆర్టీసీలో ఇంజినీర్ ఉద్యోగం, తల్లి కల్పకం ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమంతో ఢిల్లీకి చేరిన ఏచూరి.. ఢిల్లీలోని ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్‌లో 12వ తరగతి పూర్తి చేశారు.
Former Chief Padmanabhan : భారత సైన్యం మాజీ చీఫ్ పద్మనాభన్ కన్నుమూత
ప్రఖ్యాత సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో బీఏ ఆనర్స్ చేశారు. జవహార్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఎమ్‌ఏ ఎకనామిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ కావడంతో చదవుకు ఫుల్‌స్టాఫ్ పెట్టారు.
1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ)లో సభ్యుడిగా ఏచూరి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 1975లో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) సభ్యునిగా చేరారు. 1978లో అఖిల భారత ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్త కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి సీతారాం 1992 నుంచి సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2005లో బెంగాల్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగాడు.