Kerala Governor: కేరళ గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణ స్వీకారం
కేరళ రాష్ట్ర 23వ గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేశారు.
జనవరి 2వ తేదీ రాజ్ భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నితిన్ జమ్దార్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
బీహార్ గవర్నర్‌గా నియమితులైన ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అనంతరం ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన కేబినెట్ మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
#Tags