Andhra Pradesh's new DGP: రాష్ట్ర డీజీపీగా అత్యధిక కాలం పని చేసిన అధికారి?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నూతన డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌(డీజీపీ)గా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌ రెడ్డి(కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి) నియమితులయ్యారు. పూర్తి అదనపు బాధ్యతలతో రాష్ట్ర డీజీపీగా ఫిబ్రవరి 19న ఆయన మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో గౌతం సవాంగ్‌ నుంచి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు పూర్తి భద్రత కల్పించడమే తన ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు.

డీజీపీగా అత్యధిక కాలం పని చేసిన సవాంగ్‌

ఆంద్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన అనంతరం అత్యధిక కాలం  డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించిన పోలీసు అధికారిగా గౌతం సవాంగ్‌ రికార్డు సృష్టించారు. ఆయన రెండు సంవత్సరాల ఎనిమిది నెలల 18 రోజులపాటు రాష్ట్ర పోలీస్‌ బాస్‌గా కీలకమైన స్థానంలో కొనసాగారు. రాష్ట్ర విభజన తర్వాత నుంచి అంటే 2014 జూన్‌ 2 నుంచి 2022 ఫిబ్రవరి 18 వరకు ఏపీలో ఐదుగురు డీజీపీలుగా వ్యవహరించారు.

రాష్ట్ర విభజన తర్వాత డీజీపీలు

పేరు

పని చేసిన కాలం

పని చేసిన రోజులు

జేవీ రాముడు

2014 జూన్‌ 2 – 2016 జూలై 23

25 నెలల 21 రోజులు

ఎన్‌.సాంబశివరావు

2016 జూలై 23 – 2017 డిసెంబర్‌ 31

17 నెలల 8 రోజులు

ఎం.మాలకొండయ్య

2017 డిసెంబర్‌ 31 – 2018 జూన్‌ 30

6 నెలలు

ఆర్పీ ఠాకూర్‌

2018 జూన్‌ 30 – 2019 మే 31

11 నెలలు

గౌతం సవాంగ్‌

2019 జూన్‌ 1 – 2022 ఫిబ్రవరి 19

32 నెలల 18 రోజులు

చ‌ద‌వండి: ఫెయిర్‌ప్రైస్‌ సీఈవోగా నియమితులైన భారత సంతతి వ్యక్తి?

క్విక్‌ రివ్యూ   : 
ఏమిటి    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నూతన డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌(డీజీపీ)గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు    : కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌ రెడ్డి(కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి)
ఎక్కడ    : మంగళగిరి, గుంటూరు జిల్లా
ఎందుకు : ఇప్పటివరకు రాష్ట్ర డీజీపీగా ఉన్న గౌతం సవాంగ్‌ బదీలీ నేపథ్యంలో..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags