Kamerita Sherpa: కమిరిటా షెర్పా కొత్త ప్రపంచ రికార్డు
నేపాలీ పర్వతారోహకుడు కమిరిటా షెర్పా(53) సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు.
ఎనిమిది వేల మీటర్లు పైబడి ఎత్తయిన పర్వత శిఖరాలను 42సార్లు అధిరోహించిన ఘనతను ఆయన సాధించారు. 8 వేల మీటర్లకంటే మించి ఎత్తయిన శిఖరాలను 41 పర్యాయాలు అధిరోహించిన మరో ప్రముఖ నేపాలీ పర్వతారోహకుడు నిమ్స్ పుర్జా పేరిట ఉన్న రికార్డును తాజాగా కమి రిటా బద్దలు కొట్టారు.
M.S Swaminathan passes away: హరిత విప్లవ పితామహుడు... వరిలో మేలైన వంగడాలు... ఇలా మరెన్నో!!
ప్రపంచంలోని ఎనిమిదో ఎత్తయిన మౌంట్ మనస్లును మంగళవారం ఉదయం కమి రిటా షెర్పా అధిరోహించారని సెవెన్ సమిట్ ట్రెక్స్ అనే పర్వతారోహక సంస్థ తెలిపింది. ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని కమి రిటా 1994లో మొదటిసారి అధిరోహించారు. అది మొదలు ఇప్పటిదాకా 28 సార్లు ఎక్కారు.
World Cup golden ticket: రజినీకాంత్‍కు ప్రపంచకప్ గోల్డెన్ టికెట్
#Tags