Former Chief Padmanabhan : భారత సైన్యం మాజీ చీఫ్‌ పద్మనాభన్‌ కన్నుమూత

భారత సైన్యం మాజీ చీఫ్‌ జనరల్‌ సుందరరాజన్‌ పద్మనాభ‌న్‌ (83) ఆగస్టు 19న వృద్ధాప్య కారణాల వల్ల తుది శ్వాస విడిచారు. ఆయన 2000 సెప్టెంబరు 30 నుంచి 2002 డిసెంబరు 31 వరకు ఆర్మీ చీఫ్‌గా పని చేశారు. ఆర్మీ చీఫ్‌గా నియమితులు కాకముందు ఆయన సౌతర్న్‌ కమాండ్‌లో జనరల్‌ కమాండిరగ్ ఆఫీసర్‌గా పనిచేశారు.

Rajesh Nambiar: నాస్కామ్‌ ప్రెసిడెంట్‌గా రాజేశ్‌ నంబియార్

మొత్తానికి 1960 నుంచి 2002 వరకు ఆయన 43 ఏళ్లపాటు ఆర్మీకి సేవలు అందించారు. 2002 డిసెంబర్‌ 31న సుందర రాజన్‌ ఆర్మీ చీఫ్‌గా పదవీ విరమణ చేశారు. 15 కోర్‌ కమాండర్‌గా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా అతి విశిష్ట్‌ సేవా పతకాన్ని ప్రభుత్వం ప్రదానం చేసింది.
 

#Tags