Jaiteerth Raghavendra Joshi: బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ సీఈవోగా జైతీర్థ్‌ రాఘవేంద్ర జోషి

బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ సీఈవోగా ప్రముఖ శాస్త్రవేత్త జైతీర్థ్‌ రాఘవేంద్ర జోషి ఢిల్లీలో డిసెంబ‌ర్ 1వ తేదీ బాధ్యతలను స్వీకరించారు.

జోషి రక్షణ రంగంలో 30 ఏళ్ల అనుభవంతో ఉన్నారు. ఆయన ఇదివరకే హైదరాబాద్‌లోని 'డీఆర్‌డీఎల్‌' (రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాల)లో ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు.

ప్రస్తుత సీఈవో అతుల్‌ దిన్‌కర్‌ పదవీకాలం ముగిసిన తర్వాత, రక్షణశాఖ జోషిని 2024 నవంబర్ 26న బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ సీఈవోగా నియమించింది.

జోషి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ పూర్తి చేశారు. తరువాత, నిట్‌ వరంగల్‌ నుంచి పీహెచ్‌డీ చేశారు. ఆయన క్షిపణి సాంకేతికతలో ప్రత్యేకంగా ప్రఖ్యాతి గాంచారు.

పృథ్వి, అగ్ని క్షిపణుల తయారీలో ఆయన కీలక పాత్ర పోషించారు. అలాగే.. ఉపరితలం నుంచి గాల్లోని లక్ష్యాలను ఛేదించగల దీర్ఘశ్రేణి క్షిపణుల (ఎల్‌ఆర్‌సామ్‌) తయారీ ప్రాజెక్టులో డైరెక్టర్‌గా వ్యవహరించారు.

New CAG of India: 'కాగ్' బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు అధికారి ఈయ‌నే..

#Tags