Brazil Football Player Pele : ఫుట్‌బాల్‌ దిగ్గజం పీలే ఇక‌లేరు.. ఈయ‌న ప్రపంచక‌ప్‌ రికార్డులు ఇవే..

మూడు ప్రపంచకప్‌ విజయాల్లో భాగస్వామి అయిన ఏకైక ఆటగాడు.. బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం పీలేనే (82) ఇక లేరు. గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన భారత కాలమానం ప్రకారం డిసెంబ‌ర్ 29వ తేదీన (గురువారం) అర్ధరాత్రి దాటిన తర్వాత తుదిశ్వాస విడిచారు.
Brazil Football Player Pele

ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. పీలే బ్రెజిల్‌కు మూడుసార్లు ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లు అందించారు. అలాగే త‌న కెరీర్‌లో 1,281 గోల్స్‌ చేశారు.

1958, 1962, 1970లలో బ్రెజిల్‌ ప్రపంచకప్‌ గెలవడంలో పీలే ముఖ్యపాత్ర పోషించాడు. స్టార్‌ ఆటగాళ్లు ఉన్న జట్టులో 17 ఏళ్ల వయసులో తొలి ప్రపంచకప్‌లో చెలరేగిన పీలే మరో 12 ఏళ్ల తర్వాత ఎవరికీ అందనంత ఎత్తుకి తనే ఒక దిగ్గజంగా ఎదిగాడు. కెరీర్‌ మొత్తంలో నాలుగు ప్రపంచకప్‌లు ఆడిన పీలే మొత్తం 12 గోల్స్‌ సాధించాడు.

Top-5 Football Legends : అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన‌.. టాప్‌–5 స్టార్స్ వీరే..!

ఏదో శక్తి మైదానంలో పరుగెడుతున్నట్లుగా.. 

విద్యుత్‌కు రూపం ఇస్తే అతనిలాగే ఉంటుందన్నట్లుగా దూసుకెళ్లేవాడు. రెండు కాళ్లతోనూ బంతిని నియంత్రించే అతను.. ప్రత్యర్థి వ్యూహాలను పసిగట్టడంలో దిట్ట. ఎదురుగా ఎంతమంది ప్రత్యర్థి ఆటగాళ్లు ఉన్నా బంతిని డ్రిబ్లింగ్‌ చేయడంలో అతని శైలే వేరు. 

FIFA World Cup 2022 : ఫిఫా వరల్డ్‌కప్ వ‌ల్ల‌ ఇంత భారీగా ఆదాయం వ‌స్తుందా..!

కనురెప్ప పాటులో..

గాల్లో వేగంగా వచ్చే బంతిని ఛాతీతో నియంత్రించి.. అది కిందపడి పైకి లేవగానే కాలుతో సూటిగా తన్ని గోల్‌పోస్టులోకి పంపించడంలో అతని ప్రత్యేకతే వేరు. గోల్‌కీపర్‌ అక్కడే ఉన్నా.. ఎంతగా ప్రయత్నించినా బంతిని ఆపడం మాత్రం అసాధ్యంగా ఉండేది. కనురెప్ప పాటులో బంతి నెట్‌ను ముద్దాడేది. ఈ తరం అభిమానులకు పీలే ఆట గురించి అంతగా తెలిసి ఉండదు. కానీ యూట్యూబ్‌లోకి వెళ్లి ‘పీలే  టాప్‌ 5 గోల్స్‌’ అని కొడితే ఫిఫా అధికారిక ఛానెల్‌లో వీడియో ఉంటుంది. అందులో కేవలం ప్రపంచకప్‌ల్లోని అతని ఉత్తమ అయిదు గోల్స్‌ దృశ్యాలు మాత్రమే ఉన్నాయి. కానీ అవి  చూసినా అతని మాయ అర్థమవుతోంది.

FIFA World Cup : ఫిఫా చరిత్రలో మ‌రిచిపోలేని ఐదు వివాదాలు ఇవే..

ప్రపంచ ఫుట్‌బాల్‌లో తిరుగులేని శక్తిగా..

1970 ప్రపంచకప్‌లో రొమేనియాతో పోరులో దాదాపు 25 గజాల దూరం నుంచి ఫ్రీకిక్‌ను.. డిఫెండర్ల మధ్యలో నుంచి గోల్‌పోస్టులోకి అతను పంపించిన తీరు అమోఘం. 1958 ప్రపంచకప్‌ ఫైనల్లో స్వీడన్‌పై పెనాల్టీ ప్రదేశంలో సహచర ఆటగాడి నుంచి బంతి అందుకున్న అతను.. ఇద్దరు ప్రత్యర్థి ఆటగాళ్లను తప్పించి, గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టించిన వైనం అసాధారణం. గోల్‌కీపర్‌ డైవ్‌ చేసినా ఆ బంతిని ఆపలేకపోయాడు. ఇలాంటి గోల్స్‌ మరెన్నో. ప్రపంచ ఫుట్‌బాల్‌లో తిరుగులేని శక్తిగా బ్రెజిల్‌ ఓ వెలుగు వెలిగిందంటే అందుకు ప్రధాన కారణం పీలే. 

FIFA World Cup 2022 : 1950లో గోల్డెన్‌ చాన్స్‌ను వదులుకున్న‌ భారత్‌.. ఇంత‌కు ఆ ఏడాది ఏమైందంటే..?

ప్రపంచకప్‌లో ఉత్తమ ఆటగాడిగా..


1958 ప్రపంచకప్‌లో మోకాలి గాయాన్ని సైతం లెక్కచేయకుండా రాణించి ఉత్తమ యువ ఆటగాడి అవార్డు అందుకున్నాడు. 1962, 1966 ప్రపంచకప్‌లో గాయం కారణంగా ప్రభావం చూపలేకపోయాడు. 1966లో జట్టు నిరాశాజనక ప్రదర్శనతో అతను ఆటకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడు. కానీ మళ్లీ జట్టులోకి వచ్చి 1970 ప్రపంచకప్‌లో ఉత్తమ ఆటగాడిగా బంగారు బంతి సొంతం చేసుకున్నాడు. 1971 జులైలో యుగోస్లేవియాతో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు.

FIFA World Cup History : ఫిఫా వరల్డ్‌కప్‌ ట్రోఫీని దేనితో.. ఎలా తయారు చేస్తారంటే..?

#Tags