Skip to main content

Edson Arantes do Nascimento: సాకర్‌ మాంత్రికుడు పీలే కన్నుమూత

Football legend Pele dies at 82

సాకర్‌ చరిత్రలోనే అత్యంత మేటి ఆటగాడిగా గుర్తింపు పొందిన పీలే ఇటీవల కన్నుమూశారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన పీలే అసలు పేరు ఎడ్సన్‌ అరాంటెస్‌డో నాసిమెంటో. అవయవాలు పనిచేయకపోవడంతోపాటు పెద్దపేగు క్యాన్సర్‌ తీవ్రమవడంతో 82ఏళ్ల పీలే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తన 21ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో మూడు ప్రపంచకప్‌లు ముద్దాడిన పీలే 1363 మ్యాచ్‌లు ఆడి 1281 గోల్స్‌చేశారు. ప్రపంచంలో మరే ఆటగాడు ఇన్ని గోల్స్‌ సాధించలేదు. ఫిఫా ప్రపంచకప్‌ను మూడుసార్లు గెలిచిన జట్టులో ఉన్న ఏకైక ఆటగాడిగా పీలే ఘనత సాధించారు. తన తొలి ప్రపంచకప్‌(1958)లోనే ఆరు గోల్స్‌కొట్టి అదరగొట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అవార్డులు,రివార్డు లు దక్కించుకున్న పీలేను 2000సంవత్సరంలో ఫిఫా ‘శతాబ్దపు అత్యుత్తుమ ఆటగాడి’గా ప్రకటించింది. 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 14 Jan 2023 01:16PM

Photo Stories