Skip to main content

Football legend Pele: దివికేగిన సాకర్‌ శిఖరం

ఆటే అతని లోకం.. ఆటే అతని ప్రాణం.. చురుకుదనంలో అతనో పాదరసం.. గోల్‌ చేస్తే లోకమే దాసోహం.. అతను డ్రిబ్లింగ్‌ చేస్తే బిత్తరపోవాల్సిందే.. అటాకింగ్‌కు దిగితే చేతులెత్తేయాల్సిందే.. ఫార్వర్డ్‌గా అతని విన్యాసాలకు సలాం కొట్టాల్సిందే.. ఇంత గొప్ప ఆటగాడు ఫుట్‌బాల్‌లో ఉన్నందుకు ఆ క్రీడే మురిసింది. తమ జట్టులో ఆటగాడైనందుకు బ్రెజిల్‌ అదృష్టం చేసుకుంది. దీంతో ఈపాటికే అందరికి అర్థమై ఉంటుంది.. అతనేవరో కాదు సాకర్‌ సమున్నత శిఖరం పీలే అని! నిజం.. అతని ఆట అద్భుతం. అతని గోల్స్‌ అసాధారణం. అతని అంకితభావం నిరుపమానం. వరం పొందిన బ్రెజిల్‌కు.. అంకితమైపోయిన ఫుట్‌బాల్‌కు.. మెప్పించిన గోల్స్‌కు.. అతనితో ఆడి అలసిన ప్రత్యర్థులకు.. తమకిది భాగ్యమనుకున్న ప్రేక్షకులకు.. కురిపించిన ఆదరాభిమానాలకు సెలవు చెప్పాడు పీలే!

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ చరిత్రలో తన శకం లిఖించిన బ్రెజిల్‌ దిగ్గజం పీలే ఇక లేడు. మూడుసార్లు ‘ఫిఫా’ ప్రపంచకప్‌ను గెలిపించిన బ్రెజిలియన్‌ సాకర్‌ కింగ్‌ పీలే డిసెంబ‌ర్ 29 అర్ధరాత్రి తుదిశ్వాస విడిచాడు. సావోపాలోలోని అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ హాస్పిటల్‌లో 82 ఏళ్ల పీలే కన్నుమూశాడు. గతేడాది పెద్దపేగు క్యాన్సర్‌ బారిన పడిన అతను అప్పటి నుంచి పోరాటం చేస్తున్నాడు. గతనెల ఆరోగ్యం విషమించడంతో అతన్ని ఐన్‌స్టీన్‌ ఆస్పత్రిలో చేర్చారు. అయితే అవయవాలన్నీ క్రమంగా పాడైపోవడంతో అతని శరీరం చికిత్సకు స్పందించ లేదు. 
బంతి మైదానంలో పారాడితే కాళ్లతో డ్రిబ్లింగ్‌.. గాల్లో ఉంటే ఛాతీతో కంట్రోల్‌.. గోల్‌పోస్ట్‌ వద్ద ఎగిరొస్తే హెడర్‌.. కింది నుంచి పాస్‌ అయితే చక్కని కిక్‌ షాట్‌..  ఇలా బంతి ఎటునుంచి వచ్చినా.. తన చుట్టు అడుగడుగునా ప్రత్యర్థులు మాటువేసినా.. డిఫెండర్లు గోడ కట్టినా.. గోల్‌ కీపర్‌ కంచెలా నిలుచున్నా.. పీలే కచ్చితమైన లక్షిత షాట్‌ను ఎవరూ అడ్డుకోలేదు. అంతటి మంత్రముగ్ధమైన ప్రదర్శనతో, ప్రత్యర్థి శిబిరాన్ని నిశ్చేషు్టల్ని చేసే ఆటతీరుతో గోల్స్‌ కొట్టే నైపుణ్యం పీలేకు మాత్రమే సాధ్యం. 

Ministry of Road Transport: 4.12 లక్షల ప్రమాదాలు.. 1.53 లక్షల మంది బలి
అచ్చుతప్పు పిలుపుతో.. 

మినాస్‌ గెరయిస్‌ రాష్ట్రంలోని చిన్న గ్రామం ట్రెస్‌ కొరకోస్‌లో 1940 అక్టోబర్‌ 23న జన్మించిన పీలే అసలు పేరు అది కాదు. నిజానికి అది పేరులోంచి తెచ్చుకున్న పదం కూడా కాదు. పీలే పేరు.. ఎడ్సన్‌ అరాంట్స్‌ డో నాసిమియాంటో! ఇతనికి ఫుట్‌బాల్‌ అంటే పిచ్చి. తండ్రి ఫుట్‌బాలర్‌ కావడంతో ఆ పిచ్చి కాస్త వయసుతో పాటే పెరిగింది. 11 ఏళ్ల ప్రాయంలో అతని నైపుణ్యాన్ని గుర్తించిన స్థానిక ప్రొఫెషనల్‌ ప్లేయర్‌ ఒకరు సాంటోస్‌ యూత్‌ క్లబ్‌లో చేర్పించాడు. అచిరకాలంలోనే సీనియర్‌ జట్టులోకి వచ్చేశాడు. స్కూల్‌లో చదివే రోజుల్లో వాస్కోడి సావో లౌరెంకో క్లబ్‌ గోల్‌ కీపర్‌ ‘బిలే’ పీలే ఫేవరెట్‌ ఆటగాడు. అతడిని ‘బీలే’గా కాకుండా పీలేగా తప్పుగా పిలిచేవారు. ఆ తర్వాత సహచర విద్యార్థులు ఈ పేరును పీలేకు పెట్టేశారు. ఆ పేరు ఇప్పుడు ఫుట్‌బాల్‌ చరిత్రలో చెరగని సంతకం చేసింది.  
అటకెక్కిన అంతర్యుద్దం 
ఆతని ఆటన్న.. అతనికి ఉన్న క్రేజన్న ఎంటో ఈ ఒక్క ఉదంతంతో తెలుస్తుంది. 1969లో నైజీరియా అంతటా అంతర్యుద్దంతో అట్టుడుకుతోంది. పీలే అప్పటికే విశ్వవ్యాప్త ఆదరాభిమానాలు సంపాదించుకున్నాడు. కానీ ఏమూలో అనుమానం.. ఈ అగ్గితో సాంటోస్‌ క్లబ్, స్టేషనరీ స్పోర్ట్స్‌ క్లబ్‌ మధ్య ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ జరుగుతుందా? అని.. అయితే ఈ అనుమానాలు పటాపంచలు చేస్తూ నైజీరియాలోని రెండు వర్గాలు పీలే ఆట కోసం విరామం ప్రకటించాయి. దీంతో కాసేపు అంతర్యుద్దం   అటకెక్కగా..  ఆట మైదానంలో ఉరకలెత్తించింది. అట్లుంటది పీలేతోని! 
ఖాళీగా కూర్చోలేదు 
రిటైర్మెంట్‌ తర్వాత.. ఇన్ని పేరు ప్రఖ్యాతలు, అవార్డులు, రివార్డులు సాధించాక ఇక ఆటపాట నాకెందుకని ప్రశాంతంగా కూర్చోలేదు. ఆటగాడిగా బిజీగా గడిపిన తర్వాత డాక్యుమెంటరీ నటుడిగాను మెప్పించాడు. ఆల్బమ్‌లను రూపొందించాడు. పలు ఆటోబయోగ్రఫీలను కూడా ప్రచురించాడు. వ్యాపారవేత్తగాను విజయవంతమయ్యాడు. అనంతరం ఈ విశిష్ట ఫుట్‌బాలర్‌ను 1994లో యునెస్కో గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా నియమించింది. మరుసటి ఏడాది బ్రెజిల్‌ అధ్యక్షుడు.. తమ దేశ క్రీడల మంత్రిగాను నియమించారు. 1997లో క్వీన్‌ ఎలిజబెత్‌ –2 చేతుల మీదుగా ‘నైట్‌హుడ్‌’ను కూడా అందుకున్నాడు.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (03-09 డిసెంబర్ 2022)
ఇంత చేసినా.. ఇతనికి తప్పలేదు 

ఫుట్‌బాల్‌ ఆట ప్రభను పెంచి.. బ్రెజిల్‌ సాకర్‌ సత్తాను చాటి.. క్రీడకే నిలువెత్తు నిదర్శనంలా నిలిచిన పీలేకు ‘నల్లజాతి’ అవమానాలు తప్పలేదు. అభిమానులు, సాకర్‌ లోకం అతన్ని వేనోళ్ల స్తుతిస్తే మతిలేని మంద, గిట్టని ప్రబుద్ధులు కొందరు అతని వర్ణం సాకుతో గేలిచేశారు. నల్ల కోతిలాంటి వెకిలి చేష్టలతో ఇబ్బంది పెట్టేవారు. కానీ దీపం మండే కొద్దీ వెలుగును ప్రభవించినట్లే... ఆడే కొద్దీ తన ఆటతీరుతో పీలే ఫుట్‌బాల్‌ క్రీడకే వన్నె తెచ్చాడు తప్ప తలొగ్గే పని, తలదించుకునే పని ఏనాడూ చేయలేదు. 

మూడు వరల్డ్‌కప్‌ విజయాల్లో.. 
బ్రెజిల్‌ జట్టులోకి రాగానే తనకు మాత్రమే సాధ్యమైన ఆటతీరుతో పీలే కీలక ఆటగాడిగా మారాడు. దీంతో 16 ఏళ్లకే 1956లో బ్రెజిల్‌ జాతీయ జట్టుకి ఎంపికయ్యాడు. మైదానంలో మెరికలాంటి ఆటతో అందరికంటా పడ్డాడు. 1958 ప్రపంచకప్‌ కోసం స్వీడన్‌కు రిజర్వ్‌ ఆటగాడిగా వెళ్లిన పీలే కీలక ఆటగాడిగా స్వదేశానికి తిరిగొచ్చాడు. 17 ఏళ్ల టీనేజ్‌లో ప్రపంచకప్‌ లో అరంగేట్రం చేసిన పీలే బ్రెజిల్‌ చాంపియన్‌షిప్‌లో కీలకభూమిక పోషించాడు. మరో ప్రపంచకప్‌ (1962) నాటికి స్టార్‌ హోదాతో బరిలోకి దిగాడు. తన జట్టు టైటిల్‌ నిలబెట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డిన పీలే తన కొచ్చిన ‘స్టార్‌ డమ్‌’కు న్యాయం చేశాడు. రెండో ప్రపంచకప్‌ విజయంలో భాగమయ్యాడు. 1966 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ విజేతగా నిలిచింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ అయిన బ్రెజిల్‌ గ్రూప్‌ దశలోనే వెనుదిరగడం, తదనంతర పరిస్థితులతో అదే తన చివరి ప్రపంచకప్‌ అని పీలే ప్రకటించాడు. తర్వాత మనసు మార్చుకున్న ఈ దిగ్గజం 1970 ప్రపంచకప్‌ ఆడి బ్రెజిల్‌ విజయానికి బాట వేశాడు. అలా 14 ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో 12 గోల్స్‌ చేశాడు. మూడు ప్రపంచకప్‌ విజేత జట్లలో భాగమైన ఏకైక ఫుట్‌బాలర్‌గా నిలిచాడు. 

Pele with his mother


వ్యక్తిగతం 
జన్మదినం: అక్టోబర్‌ 23, 1940 
ఎక్కడ: ట్రెస్‌ కొరకోస్, బ్రెజిల్‌. 
అసలు పేరు: ఎడ్సన్‌ అరాంట్స్‌ డో నాసిమియాంటో. 
తల్లిదండ్రులు: సెలెస్టె అరాంట్స్, జొవో రామోస్‌ నాసిమియాంటో. 
పెళ్లిళ్లు 3: రోజ్‌మెరి (1966–78), అసిరియా (1994–2010), మార్సియా (2016 నుంచి) 
సంతానం: కెలీ, ఎడ్సన్, జెన్నిఫర్, సాండ్రా (మృతి), ఫ్లావియా, జోషువా, సెలెస్టె.  

Prachanda: నేపాల్‌ ప్రధానిగా ప్రచండ

భారత్‌తో అనుబంధం.. 
బ్రెజిల్‌ దిగ్గజం పీలేకు భారత్‌తో చక్కని అనుబంధమే ఉంది. కెరీర్‌లో, అనంతరం బిజీబిజీగా ఉండే పీలే మూడు సార్లు భారత పర్యటనకు వచ్చాడు. ముందుగా 1977లో కలకత్తా (ఇప్పటి కోల్‌కతా)కు వచ్చిన పీలే... న్యూయార్క్‌ కాస్మోస్‌ టీమ్‌ తరఫున మోహన్‌ బగాన్‌ క్లబ్‌ జట్టుతో ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ ఆడాడు. ప్రతిష్టాత్మక ఈడెన్‌ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్‌ జరిగింది. పీలే రాకతో కలకత్తా సాకర్‌ ప్రియుల ఆనందానికి అవధుల్లేవ్‌! సాకర్‌ మేనియాలో నగరం తడిసిముద్దయ్యింది. అనంతరం మళ్లీ 2015లోనూ ఇక్కడికొచ్చాడు. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) టోర్నీలో భారత క్రికెట్‌ జట్టు మాజీ కెపె్టన్‌ సౌరవ్‌ గంగూలీ సహ యజమానిగా ఉన్న అట్లెటికో డి కోల్‌కతా క్లబ్‌కు చెందిన కార్యక్రమంలో గంగూలీతో, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, విఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌లతో కలసి పీలే పాల్గొన్నాడు. అక్కడి నుంచి ఢిల్లీకి పయనమైన పీలే స్కూల్‌ విద్యార్థులతో ఫుట్‌బాల్‌ ఆడాడు. ‘భారతీయ చిన్నారులతో ప్రపంచ ప్రఖ్యాత క్రీడ ఫుట్‌బాల్‌ ఆడటం ఎంతో ఆనందంగా ఉంది’ అని ఈ సందర్భంగా అన్నాడు. 2018లో కూడా పీలే వచి్చనప్పటికీ ఓ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సులో పాల్గొని ఎలాంటి హడావుడి చేయకుండా వెళ్లిపోయాడు.  

Road Accidents: హెల్మెట్‌ పెట్టుకోకపోవడంతో 46,593 మంది మృతి

అంత్యక్రియలు.. 
ప్రపంచానికి తన సత్తా చాటిన విలా బెల్మిరా స్టేడియంలో పీలే పార్థివదేహాన్ని ఉంచుతారు. సావోపాలో శివారులో ఉన్న ఈ స్టేడియంలో డిసెంబ‌ర్ 1న అభిమానులు నివాళులు అర్పించాక సాంటోస్‌లోని మెమోరియల్‌ నెక్రొపోలె ఎక్యుమెనికలో డిసెంబ‌ర్ 3న‌ అంత్యక్రియలు నిర్వహిస్తారు. కేవలం పీలే కుటుంబసభ్యులే దీనికి హాజరవుతారు. మంచానికి పరిమితమైన పీలే మాతృమూర్తి చూసేందుకు వీలుగా ఆయన అంతిమయాత్రను పీలే ఇంటిముందు నుంచి తీసుకెళ్తారు.  

Published date : 02 Jan 2023 05:47PM

Photo Stories