President of APABC: ఏపీఏబీసీ ప్రెసిడెంట్‌గా హొర్మూజ్‌ మసానీ

ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్స్‌ (ఏబీసీ–ఇండియా) జనరల్‌ సెక్రెటరీ హొర్మూజ్‌ మసానీ వరుసగా ఐదోసారి ఏషియా పసిఫిక్‌ ఆడిట్‌ బ్యూరో ఆఫ్ సర్టిఫికేషన్‌ (ఏపీఏబీసీ) అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.

ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆడిట్‌ బ్యూరో ఆఫ్ సర్టిఫికేషన్‌ (ఐఎఫ్‌ఏబీసీ) సర్వసభ్య సమావేశంలో ఆయనను ఈ మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

అలాగే.. ఆనరరీ ట్రెజరర్‌ హోదాలో ఐఎఫ్‌ఏబీసీ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు మెంబర్‌గా కూడా మసానీ వరుసగా తొమ్మిదోసారి ఎన్నికయ్యారు. ఆయన 1998 నుంచి ఏబీసీ సెక్రెటరీ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు. 2008 నుంచి ఐఎఫ్‌ఏబీసీలో ఏబీసీ–ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

Shyamakant Giri: గ్లాండ్ ఫార్మా సీఈఓగా శ్యామకాంత్ గిరి

#Tags