EAM Jaishankar: 'ఫియర్‌లెస్' పుస్తకావిష్కరణలో పాల్గొన్న జైశంకర్
ఈ కార్యక్రమంలో జైశంకర్ భారత క్రికెట్, విదేశాంగ విధానాల మధ్య పోలికను వివరించారు. పాకిస్థాన్ విషయంలో మారిన భారత విదేశాంగ వైఖరిని క్రికెట్ ఆడే విధానంతో పోల్చుతూ.. 1983 ప్రపంచకప్ గెలిచిన తర్వాత భారత క్రికెట్‌లో జరిగిన మార్పులను ఉదాహరణగా తీసుకున్నారు.
జైశంకర్ భారత్ ప్రస్తుతం ప్రపంచంలో ఎలా ఉన్నదీ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న భారత ప్రభుత్వ విధానాల ప్రభావాన్ని, ఇతర దేశాలతో ఉన్న సంబంధాలను, దేశం మీద ఉన్న శక్తి సామర్థ్యాలను వివరించారు. పాకిస్థాన్‌తో సంబంధాల్లో భారత వైఖరి మారిన తీరు, 1982-83లో భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్‌లో ఆటలో మార్పులు చేసుకోవడం ద్వారా కొత్త దారులు అన్వేషించినట్లు, విదేశాంగ విధానంలో కూడా మార్పులు కనిపిస్తున్నాయని తెలిపారు.
New CAG of India: 'కాగ్' బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు అధికారి ఈయనే..
మొహిందర్ అమర్‌నాథ్ 1969-89 మధ్యకాలంలో భారత జట్టుకు ఆడారు. 1983 వన్డే ప్రపంచకప్ సెమీస్, ఫైనల్‌లలో అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.