High Court: బహిరంగంగా దూషిస్తేనే ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తింపు

సాక్షి ఎడ్యుకేష‌న్: ‌ఒక వ్యక్తిని బహిరంగంగా అవమానించడం, బెదిరించడం లేదా కించపరచడం చేస్తేనే ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం వర్తిస్తుందని అలహాబాద్‌ హైకోర్టు తీర్పు చెప్పింది. ఏడుగురు వ్యక్తులు తన ఇంటికి వచ్చి.. తనపైనా, తన కుటుంబ సభ్యులపైనా దాడి చేసి, కులం పేరుతో దూషించారని ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Cyclone Remal: దూసుకొస్తున్న 'రెమాల్' తుపాను.. ఇక్క‌డ భారీ వర్షాలు కురిసే అవకాశం!

వారిపై ఐపీసీ, ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్‌ 3(1)(ఆర్‌) ప్రకారం–2017 నవంబరులో కేసు నమోదైంది. దీనిపై నిందితుల్లో ముగ్గురు హైకోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదుదారు ఇంట్లో ఈ ఆరోపిత నేరం జరిగిందని.. ఆయన ఇల్లు బహిరంగ ప్రదేశం కాదని, ప్రజలు చూసే ప్రదేశం కాదని.. అందువల్ల ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తించదని వాదనలు వినిపించారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. బహిరంగంగా ఈ నేరం జరగలేదు కాబట్టి ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్‌ 3(1)(ఆర్‌) వర్తించదని కోర్టు తీర్పు చెప్పింది. 

International Labour Organization Report: దేశం మొత్తం రొయ్యల ఉత్పత్తిలో 76 శాతం ఏపీలోనే..

#Tags