Vande Bharat Train: 20 కోచ్‌ల వందేభారత్‌.. ట్రయల్‌ రన్‌ విజయవంతం

అత్యాధునిక, సౌకర్యవంతమైన ప్రయాణానికి వందేభారత్‌ రైలు పేరొందింది.

ఇప్పుడు మరో వందేభారత్‌ రైలు పట్టాలపై పరుగులు తీయనుంది. పశ్చిమ రైల్వే తాజాగా అదనపు బోగీలతో కూడిన వందేభారత్ రైలును పరీక్షించింది. ఈ రైలు ఐదు గంటల 21 నిమిషాల్లో అహ్మదాబాద్ నుంచి ముంబై చేరుకుంది.

కొత్తగా పట్టాలెక్కిన ఈ కాషారంగు వందేభారత్‌కు అదనంగా నాలుగు కోచ్‌లను జతచేర్చారు. దీంతో మొత్తం 20 బోగీలతో ఈ నూతన వందేభారత్‌ రైలు పరుగులు తీయనుంది. ఆగ‌స్టు 9వ తేదీ అహ్మదాబాద్-ముంబై మధ్య గంటకు 130 కిలోమీట‌ర్ల‌ వేగంతో ఈ రైలుకు సంబంధించిన ట్రయల్ రన్ నిర్వహించినట్లు అధికారి తెలిపారు. 

ఉదయం 7 గంటలకు అహ్మదాబాద్‌లో బయలుదేరిన రైలు మధ్యాహ్నం 12:21 గంటలకు ముంబై సెంట్రల్‌కు చేరుకుంది. తిరిగి మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ రైలు ముంబై సెంట్రల్ నుంచి అహ్మదాబాద్‌కు తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించింది. 

భారతీయ రైల్వే 2024, జూలై 29 నుంచి దేశవ్యాప్తంగా 102 వందే భారత్ రైలు సర్వీసులను నడుపుతోంది. ప్రస్తుతం ముంబై- అహ్మదాబాద్ మధ్య వందే భారత్, తేజస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ తదితర రైళ్లతో సహా 50కి పైగా రైలు సర్వీసులు నడుస్తున్నాయి.

High Speed Rail: చెన్నై–మైసూర్‌ మధ్య తొలి హైస్పీడ్‌ రైలు.. వయా చిత్తూరు మీదుగా..

#Tags