Nalanda University: నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్‌ ప్రారంభం.. ఎక్క‌డంటే..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిహార్‌లోని రాజ్‌గిర్‌లో నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్‌ను జూన్ 19వ తేదీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మోదీ విజ్ఞానాన్ని అగ్నికీలలతో కాల్చి బూడిద చెయ్యలేమని, ఇందుకు నలంద విశ్వవిద్యాలయమే ఒక ఉదాహరణ అని చెప్పారు. 21వ శతాబ్దంలో భారత్‌ కీలక పాత్ర పోషించనుందని, ఆ శతాబ్దం ఆసియాదేనని, 2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని పునరుద్ఘాటించారు. 

విద్యా రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించిన దేశాలే ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో అగ్రరాజ్యాలుగా ఎదుగుతాయని, ఇది చరిత్ర చెబుతున్న సత్యం అని పేర్కొన్నారు. ప్రాచీన కాలంలో మన దేశం ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో అగ్రరాజ్య హోదాను అనుభవించిందని గుర్తుచేశారు. అప్పట్లో నలంద, విక్రమశిల వంటి విద్యాసంస్థలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయన్నారు.  

Most Expensive Indian City: దేశంలోనే అత్యంత ఖరీదైన నగరాల్లో అగ్రస్థానంలో ఉన్న‌దిదే.. ఇక్కడ ఈ ఖర్చులు ఎక్కువే..!

గ్లోబల్‌ ర్యాంకింగ్స్‌లో మన వర్సిటీలు   
భారత్‌ను ప్రపంచ వైజ్ఞానిక కేంద్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో భాగంగా చిన్నారుల్లో నవీన ఆలోచనలను ప్రోది చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ‘అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌’ల ద్వారా కోటి మందికిపైగా బాలలకు అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తున్నామని అన్నారు. చంద్రయాన్, గగన్‌యాన్‌ వంటి ప్రయోగాలు మన బాలబాలికల్లో సైన్స్‌ పట్ల ఉత్సకతను కలిగిస్తున్నాయని చెప్పారు. 

పదేళ్ల క్రితం మన దేశంలో కేవలం 100 స్టార్టప్‌ కంపెనీలు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 1.30 లక్షలు దాటేసిందన్నారు. రికార్డు స్థాయిలో పేటెంట్లు మనకు లభిస్తున్నాయని, రీసెర్చ్‌ పేపర్ల ప్రచురణలో ముందంజలో ఉన్నామని పేర్కొన్నారు. పరిశోధన, నవీన ఆవిష్కరణలకు మరింత ఊతం ఇవ్వడానికి రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధిని ప్రకటించామన్నారు. 

గత పదేళ్లుగా చూస్తే మన దేశంలో సగటున ప్రతి వారానికొక యూనివర్సిటీని నెలకొల్పినట్లు నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుతం 23 ఐఐటీలు, 21 ఐఐఎంలు, 22 ఎయిమ్స్‌లు ఉన్నాయన్నారు. గత పదేళ్లలో మెడికల్‌ కాలేజీ సంఖ్య రెండింతలు అయ్యిందన్నారు.

Nakshatra Sabha: భారత్‌లో మొట్టమొదటి ఆస్ట్రో టూరిజం ప్రారంభం..

#Tags