Skip to main content

Nakshatra Sabha: భారత్‌లో మొట్టమొదటి ఆస్ట్రో టూరిజం ప్రారంభం

ఉత్తరాఖండ్ రాష్ట్రం భారతదేశంలో మొట్టమొదటి ఆస్ట్రో టూరిజం కార్యక్రమాన్ని ప్రారంభించింది.
Uttarakhand Unveils India's First Astro-Tourism Initiative

ఈ కార్యక్రమానికి "నక్షత్ర సభ" అని పేరు పెట్టారు. జూన్ 1, 2వ తేదీల్లో "కొండల రాణి" ముస్సోరీలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ప్రారంభ కార్యక్రమం ఎవరెస్ట్ శిఖరం వద్ద జరిగింది. అక్కడి నుంచి డూన్ వ్యాలీ మరియు మంచుతో కప్పబడిన హిమాలయాల అద్భుతమైన దృశ్యాలను వీక్షించే అవకాశం పాల్గొన్న వారికి లభించింది.

ఈ ఆస్ట్రో టూరిజం కార్యక్రమం ఖగోళ శాస్త్ర ఔత్సాహికులు, సాహసికులు, యాత్రికులను ఆకర్షించడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. రాష్ట్రం యొక్క అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూనే విశ్వం యొక్క అద్భుతాలను చూడటానికి వారికి అవకాశం కల్పిస్తుంది.

Nakshatra Sabha: ఉత్తరాఖండ్‌లో నక్షత్ర సభ.. ఈ సభలో ఏముందంటే..

ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యాలు..
✦ ఖగోళ శాస్త్రం, పర్యాటకంపై ఆసక్తి ఉన్న స్థానికులకు నైపుణ్య అభివృద్ధి అవకాశాలను అందించడం.
✦ రాష్ట్రంలోని ఆస్ట్రో టూరిజం పరిశ్రమను అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంపొందించడం.
✦ రాష్ట్రాన్ని ఒక ప్రముఖ ఖగోళ పర్యాటక కేంద్రంగా మార్చడం.

Published date : 08 Jun 2024 02:49PM

Photo Stories