Child Marriage: భారతదేశంలో తగ్గిన బాల్య వివాహాలు

జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. పౌర సమాజ సంస్థలు, గ్రామ పంచాయతీల కృషి కారణంగా దేశంలో బాల్య వివాహాల సంఖ్య గణనీయంగా తగ్గింది.

➤ 2023-24లో, గ్రామ పంచాయతీల సహాయంతో 59,364 బాల్య వివాహాలు నిరోధించబడ్డాయి.
➤ 17 రాష్ట్రాలు, అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలలోని 265 జిల్లాల్లో 161 పౌర సమాజ సంస్థలు 14,000కి పైగా బాల్య వివాహాలను నిరోధించాయి.
➤ రాజస్థాన్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో.. పంచాయతీలు బాల్య వివాహాలకు బాధ్యత వహిస్తాయని తేల్చిన తర్వాత ఆ రాష్ట్రంలో బాల్య వివాహాలు గణనీయంగా తగ్గాయి.
➤ అస్సాంలో.. 30% గ్రామాల్లో బాల్య వివాహాలు పూర్తిగా నిర్మూలించబడ్డాయి, 40% గ్రామాల్లో వాటి సంఖ్య గణనీయంగా తగ్గింది.

Chandipura Virus: కలకలం రేపుతున్న చాందిపురా వైరస్.. ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ!

ఎన్‌సీపీసీఆర్‌ సిఫార్సులు ఇవే.. 
➤ పెండింగ్‌లో ఉన్న బాల్య వివాహ కేసులను వేగంగా పరిష్కరించడానికి ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు.
➤ తల్లిదండ్రులు, సంరక్షకులు, గ్రామ పంచాయతీలు బాధ్యులుగా ఉన్న బాల్య వివాహాలను అత్యాచార కుట్ర కేసులుగా పరిగణించడం, బాధిత బాలికలను లైంగిక వేధింపుల బాధితులతో సమానంగా చూడటం.

➤ మహిళలకు నైపుణ్య అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడానికి ప్రత్యేక పథకాల ద్వారా బాల్య వివాహాలను నిరోధించడం.
➤ బాల్య వివాహాలను వేగంగా గుర్తించి నిరోధించడానికి 'ర్యాపిడ్ యాక్షన్ రెస్పాన్స్ ప్రోటోకాల్'తో కూడిన అత్యవసర కేంద్ర పోర్టల్ ఏర్పాటు.

Hydrogen Cruise: భారతదేశంలోనే తొలి హైడ్రోజన్‌ క్రూయిజ్‌.. ఎక్కడంటే..

#Tags