Ladla Bhai Yojana: కొత్త స్కీమ్.. నిరుద్యోగులకు నెలకు రూ.10 వేలు.. ఏ రాష్ట్రంలో అంటే..
ఈ పథకం కింద, అర్హులైన యువతకు ప్రతి నెలా వారి బ్యాంకు ఖాతాల్లో స్టయిఫండ్ జమ చేయబడుతుంది. ఈ పథకానికి రూ.5,500 కోట్లు కేటాయించబడ్డాయి.
పథకానికి సంబంధించి ముఖ్యాంశాలు ఇవే..
అర్హత:
✦ 18-35 సంవత్సరాల వయస్సు గల మహారాష్ట్ర నివాసితులు ఈ పథకానికి అర్హులు.
✦ కనీసం 12వ తరగతి పాసై పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
స్టయిఫండ్:
✦ 12వ తరగతి పాసైన వారికి నెలకు రూ.6,000
✦ ఐటీఐ/డిప్లొమా పూర్తి చేసిన వారికి నెలకు రూ.8,000
✦ డిగ్రీ/పీజీ పూర్తి చేసిన వారికి నెలకు రూ.10,000
Project ASMITA: భారతీయ భాషల్లో 22,000 పుస్తకాలను అనువదించే కొత్త ప్రాజెక్ట్ ఇదే!
పాఠ్య ప్రణాళిక:
✦ ఆరు నెలల ఇంటర్న్‌షిప్ కాలంలో అర్హులైన యువతకు ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వబడుతుంది.
✦ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా యువతను సిద్ధం చేయడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం.
మహిళల కోసం ఇప్పటికే లాడ్లీ బెహన్‌స్కీమ్‌ను ప్రారంభించామని, పురుషుల కోసం కూడా ఇలాంటి పథకం అవసరమని చాలా మంది అభ్యర్థించారని సీఎం ఏక్‌నాథ్‌శిందే తెలిపారు.
Anti Narcotics Helpline: యాంటి నార్కోటిక్స్ హెల్ప్ లైన్ నంబర్ ఇదే..