Assembly Elections: ఢిల్లీలో ఒకే విడతలో ఎన్నికలు.. ఫిబ్రవరి 5న పోలింగ్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది.

విజ్ఞాన్ భవన్‌లో జరిగిన సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. 
 
ఢిల్లీలో ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది. ఫిబ్రవరి ఐదో తేదీన అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 

ఎన్నికల షెడ్యూల్‌ ఇలా.. 

  • జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్‌ 
  • ఎన్నికలకు పోలింగ్‌.. ఫిబ్రవరి 5
  • ఎన్నికల ఫలితాలు.. ఫిబ్రవరి 8
  • నామినేషన్లకు చివరి తేదీ.. జనవరి 17
  • నామినేషన్ల విత్‌ డ్రా చివరి తేదీ.. జనవరి 20

HMPV Virus: భారత్‌లో పెరుగుతున్న‌ హెచ్‌ఎంపీవీ వైరస్‌ కేసులు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ..  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఢిల్లీలోని మొత్తం 70 స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ఈ ఏడాది తొలి ఎన్నికల్లో ఢిల్లీలో జరగబోతున్నాయి. అలాగే ఉత్తర్‌ ప్రదేశ్‌లోని మిల్కీపుర్, తమిళనాడులోని ఈరోడ్‌కూ ఉప ఎన్నికలను నిర్వహిస్తామని ఆయ‌న తెలిపారు.

Maha Kumbh Mela: మహా కుంభమేళాకు ఏర్పాట్లు.. కుంభమేళా అంటే ఏమిటి..? దేశంలో నాలుగు చోట్ల మాత్రమే..!

#Tags