Huia Bird: రికార్డు.. పక్షి ఈక విలువ‌ 23.66 లక్షలు.. కారణం ఇదే..!

ఒక పిట్ట ఈక విలువ ఎంత అంటే.. సున్నా అనుకుంటున్నారా? అయితే మీరు పొరపాటు పడినట్లే.

న్యూజిలాండ్‌లో నిర్వహించిన ఓ వేలంపాటలో పక్షి ఈక అక్షరాలా రూ.23,66,007(28,417డాలర్లు) పలికింది. ఇది పవిత్రమైన హుయియా పక్షి ఈక కావడమే ఇందుకు కారణం. దశాబ్దాల క్రితం నాటి అరుదైన ఈ ఈకను న్యూజిలాండ్‌లోని వెబ్స్‌ వేలం కేంద్రంలో తాజాగా వేలం వేశారు. ఔత్సాహికుడొకరు సొంతం చేసుకున్నారు. 

ఇదొక ప్రపంచ రికార్డు. పిట్ట ఈకకు ఈ స్థాయిలో ధర పలకడం చరిత్రలో ఇదే తొలిసారి. న్యూజిలాండ్‌లోని మవోరీ ప్రజలకు హయియా పక్షిని దైవంగా భావిస్తారు. వారి తెగ పెద్దలు తలపై ఈ పక్షి ఈకలను తలపై కిరీటంగా అలంకరించుకొనేవారు. ప్రజలు బహుమతులుగా ఇచ్చిపుచ్చుకొనేవారు. ఈకల క్రయవిక్రయాలు కూడా జరిగేవి. 

Wealthiest Cities in the World: ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల జాబితా 2024 విడుదల!

దురదృష్టవశాత్తు హుయియా పక్షులు దాదాపు అంతరించిపోయాయి. చివరిసారిగా 1907లో ఒక హుయియా పక్షిని చూసినట్లు నిర్ధారించబడింది.

#Tags