UPI in France: ఫ్రాన్స్‌లోకి అడుగు పెట్టిన 'యూపీఐ’..

డిజిటల్‌ చెల్లింపుల్లో భారత్‌ మేటి ఆవిష్కరణ అయిన ‘యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌’ (యూపీఐ) ఫ్రాన్స్‌లోకి ప్రవేశించింది.
UPI in France

భారత పర్యాటకులు ఈఫిల్‌ టవర్‌ నుంచి యూపీఐ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌ పర్యటన సందర్భంగా ప్రకటించారు. ‘‘భారతీయులు యూపీఐ సాధనం వినియోగించే విధంగా ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదిరింది. ఇది ఈఫిల్‌ టవర్‌ నుంచే ప్రారంభమవుతుంది. ఇప్పుడు భారత పర్యాటకులు ఈఫిల్‌ టవర్‌ నుంచే యూపీఐ ద్వారా రూపాయిల్లో చెల్లింపులు చేసుకోవచ్చు’’అని ప్రధాని తెలిపారు.
ఇప్పటికే భారత్‌–సింగపూర్‌ మధ్య యూపీఐ ద్వారా సీమాంతర చెల్లింపులకు ఒప్పందం కుదరడం గమనార్హం. అంతేకాదు యూఏఈ, భూటాన్, నేపాల్‌ సైతం యూపీఐ చెల్లింపుల వ్యవస్థాను అనుమతించాయి. యూఎస్, ఐరోపా దేశాలు, పశి్చమాసియా దేశాలతోనూ యూపీఐ సాధనం విషయమై భారత్‌ చర్చలు నిర్వహిస్తోంది. యూపీఐ వినియోగం ఇప్పటి వరకు భారత్‌లోనే ఉండగా, అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నట్టు ఎన్‌పీసీఐ సీఈవో రితేష్‌ శుక్లా తెలిపారు. యూపీఐని అభివృద్ధి చేసింది ఎన్‌పీసీఐ అని తెలిసిందే.  

☛☛ Investments in India:పెట్టుబడులలో చైనాను దాటిన భారత్‌

ఎలా పనిచేస్తుంది?

ఫ్రాన్స్‌కు చెందిన చెల్లింపుల పరిష్కారాలను అందించే లైరా నెట్‌వర్క్స్‌తో ఎన్‌పీసీఐ 2022లోనే ఒప్పందం చేసుకుంది. దీంతో ఫ్రాన్స్‌ను సందర్శించే భారత విద్యార్థులు, పర్యాటకులతోపాటు ఎన్‌ఆర్‌ఐలు ఇక నుంచి లైరా నెట్‌వర్క్‌ ఆధారిత అన్ని చెల్లింపుల టెర్మిన‌ల్‌ వద్ద యూపీఐతో చెల్లింపులు చేసుకోవడం సాధ్యపడుతుంది. అంతర్జాతీయ టెలిఫోన్‌ నంబర్లను ఇందుకు వినియోగించుకోవచ్చు. భారత్‌లో బ్యాంక్‌ ఖాతా, దానితో అనుసంధానించిన యూపీఐ ఐడీ ఉండాలి. అలాగే ఫోన్‌లో భీమ్‌ లేదా యూపీఐ ఆధారితే ఏదో ఒక అప్లికేషన్‌ ఉంటే దాని ద్వారా లావాదేవీలు చేసుకోవచ్చు. దీంతో కరెన్సీ మారక ఖర్చులు గణనీయంగా ఆదా అవుతాయి. రెండు దేశాల మధ్య రెమిటెన్స్‌ ఖర్చులు సైతం తగ్గుతాయి.  

☛☛ US Supreme Court: ఇక‌పై ఆ యూనివ‌ర్సిటీల్లో రిజ‌ర్వేష‌న్లు చెల్ల‌వు.... సుప్రీం కీల‌క తీర్పు

#Tags