Saare Jahan Se Achha: శ్వేతసౌధంలో అతిథులను అలరించిన 'సారే జహాసే అచ్ఛా'

భారతదేశ జాతీయ గీతం 'సారే జహాసే అచ్ఛా' అమెరికా అధ్యక్ష భవనమైన శ్వేతసౌధంలో అతిథులను అలరించింది.

అతిథులకు భారతీయ వంటకాలైన సమోసాలు, పానీపూరి వడ్డించడం ద్వారా భారతీయ సంస్కృతి వైభవాన్ని చాటిచెప్పారు. ఆసియా అమెరికన్లు, స్థానిక హవాయియన్, పసిఫిక్ ఐలాండర్‌లపై అధ్యక్షుడి సలహాసంఘం (AAANHPI) ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ వేడుక జరిగింది. 

 

 

ఈ మైలురాయిని పురస్కరించుకుని, శ్వేతసౌధంలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అగ్ర రాజ్యానికి ఏఏఎన్‌హెచ్‌పీఐ ప్రతినిధులు అందించిన సహకారాన్ని గుర్తించారు. శ్వేతసౌధం మెరైన్ బ్యాండ్ 'సారే జహాసే అచ్ఛా' గీతాన్ని ఆలపించి అతిథులను అలరించింది. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలను భారతీయ-అమెరికన్ నాయకుడు అజయ్ జైన్ భూటోరియా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 

Student Visa Rules: ఇక్క‌డ చదువుకోవాలనుకునే విద్యార్థుల వీసాకు కొత్త రూల్ ఇదే..

#Tags