Rain Tax: వర్షం కురిస్తే ట్యాక్స్ త‌ప్ప‌కుండా కట్టాల్సిందే..!

బ్రిటిష్‌ పాలనలో చాలా రకాల పన్నులు వేసేవారు.

ఇప్పటికీ వారి పాలనలో ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను, ఇంటిపన్ను, టోల్ వంటి అనేక ట్యాక్స్‌లు సామాన్యుల భారంగా మారుతున్నాయి. మనిషి తయారుచేసిన ఉత్పత్తులు, వాటికి అందించే సేవలపై ట్యాక్స్‌లుండడం సహజం. అయితే విచిత్రంగా ప్రకృతి ప్రసాదించే వర్షానికి సైతం పన్ను చెల్లించే పరిస్థితి ఏర్పడింది. బహుశా ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా ఈ విధానం లేదు. మొట్టమొదటిసారిగా కెనడాలో వచ్చే నెల నుంచి రెయిన్ ట్యాక్స్ అమలు కానున్నట్లు తెలిసింది. ఈ  మేరకు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.

తుపాను నీటి నిర్వహణ: కెనడాలో తుపాను నీటి నిర్వహణ ఒక పెద్ద సమస్యగా మారింది. మంచు కరగడం, భారీ వర్షాలు, కాంక్రీటు నిర్మాణాల వల్ల నీటి నిర్వహణ కష్టతరమైంది.

స్మార్ట్ వాటర్ ఛార్జ్: ఈ సమస్యను పరిష్కరించడానికి, కెనడా ప్రభుత్వం "స్మార్ట్ వాటర్ ఛార్జ్" అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా తుపాను నీటి నిర్వహణ ఖర్చులను ప్రజలే భరించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

రన్‌ఆఫ్: చాలా రాతినేలలు ఉండడం వల్ల వర్షపునీరు నేలలో ఇంకిపోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల "రన్‌ఆఫ్" అనే సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం మురుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది.

Biggest Library: ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ ఎక్కడుందో తెలుసా..?

పన్ను విధానం:

  • వర్షపు పన్ను ఒక్కో ప్రాంతానికి ఒక్కో విధంగా ఉంటుంది. ఎక్కువ భవనాలు ఉన్న చోట ఎక్కువ రన్‌ఆఫ్ ఉంటుంది. అందువల్ల అక్కడ వర్షం పన్ను కూడా ఎక్కువ విధిస్తారు.
  • ఈ పన్ను కేటగిరీలో ఇళ్లు, పార్కింగ్ స్థలాలు, కాంక్రీటుతో చేసిన అనేక ప్రదేశాలు ఉన్నాయి.
  • కెనడాలో విధించే వ్యక్తిగత పన్నులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. తాజాగా వర్షపు పన్ను ప్రజలపై మరింత భారంమోపేలా ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
  • అద్దె ఇళ్లలో నివసించే వారిపై ఈ పన్ను విధిస్తారా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు.

విమర్శలు:

  • నీటి పన్నుతోపాటు ప్రత్యేకంగా రెయిన్‌ట్యాక్స్‌ విధించడంపట్ల ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి.
  • కెనడా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా చాలా మంది నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

కెనడాలో వర్షపు పన్ను అమలు ఒక వివాదాస్పద అంశంగా మారింది. ప్రభుత్వం ఈ పన్ను ద్వారా తుపాను నీటి నిర్వహణ సమస్యను పరిష్కరించాలని భావిస్తుంది. అయితే, ప్రజలు ఈ పన్ను భారంగా భావిస్తున్నారు. ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి.

Amul Milk: విదేశీ మార్కెట్లలో అమూల్ పాలు.. తొలిసారిగా ఇక్క‌డే!

#Tags