Order of the Druk Gyalpo: నరేంద్ర మోదీకి భూటాన్‌లో అరుదైన గౌరవం!!

భూటాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం లభించింది.

రెండు రోజుల భూటాన్ పర్యటనకు మార్చి 22వ తేదీ భూటాన్‌ రాజధాని థింపూ చేరుకున్న మోదీకి ప్రధాని త్సెరింగ్‌ టొబ్‌గే స్వాగతం పలికారు.  విమానాశ్రయం నుంచి థింపూ వరకు 45 కిలోమీటర్ల మేర ప్రజలు రోడ్డుకు రెండువైపులా నిలబడి భారత్, టిబెట్ పతాకాలతో స్వాగతం పలికారు. కొందరు యువకులు మోదీ రాసిన పాటకు గర్బా నృత్యం చేసి ఆకట్టుకున్నారు.

రాజుతో భేటీ:

భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగ్‌చుక్, ప్రధాని త్సెరింగ్‌లతో మోదీ సమావేశమయ్యారు. రాజు, మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ డ్రుక్‌ గ్యాల్పో’ను ప్రదానం చేశారు. భారత్, భూటాన్ ప్రజల అనుబంధం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుస్తుందని మోదీ అన్నారు. భూటాన్ ప్రజల గుండెల్లో భారత్ ఎల్లప్పుడూ ఉంటుందని, స్వాగతం పలికిన యువతకు ధన్యవాదాలు తెలిపారు.

ఒప్పందాలు:

భారత్, భూటాన్ మైత్రి మరింత బలపడాలని ఆకాంక్షించారు. ప్రధాన మోదీ, త్సెరింగ్‌ల సమక్షంలో ఇంధనం, వాణిజ్యం, కనెక్టివిటీ, అంతరిక్షం, వ్యవసాయం వంటి రంగాల్లో పలు ఒప్పందాలు, ఎంవోయూలపై అధికారులు సంతకాలు చేశారు.

కొక్రాఝర్‌– గెలెఫు, బనార్హట్‌–సంత్సెల రైల్వే లైన్లపై ఎంవోయూ:

రెండు దేశాల మధ్య కొక్రాఝర్‌– గెలెఫు, బనార్హట్‌–సంత్సెల మధ్య రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి ఎంవోయూకు తుదిరూపం ఇచ్చారు.

Vande Bharat Trains: 10 ‘వందే భారత్‌’ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ.. అవి తిరిగేది ఎక్క‌డంటే..?

ప్రతికూల వాతావరణం వల్ల ఒక రోజు వాయిదా:

అసలు 21, 22వ తేదీల్లోనే మోదీ భూటాన్‌ పర్యటించాల్సి ఉండగా, ప్రతికూల వాతావరణం కారణంగా ఒక రోజు వాయిదా పడింది.

ద్వైపాక్షిక, ప్రాంతీయ విషయాలపై భాగస్వామ్యం:

ఈ పర్యటన ద్వారా ద్వైపాక్షిక, ప్రాంతీయ విషయాలపై భాగస్వామ్యాన్ని మరింత విస్తరించుకోవడానికి అవకాశం లభిస్తుందని విదేశాంగ శాఖ తెలిపింది.

#Tags