Skip to main content

First Telugu Judge In California: అమెరికాలో జడ్జిగా నియమితులైన తొలి తెలుగు మహిళ జయ బాడిగ

Governor Gavin Newsom appoints Jaya Badiga as judge in California  First Telugu Judge In California   Jaya Badiga, newly appointed judge of Sacramento County Superior Court

న్యూయార్క్‌: భారతీయ సంతతి అమెరికా పౌరురాలు, తెలుగుబిడ్డ జయ బాడిగ అక్కడి శాక్రామెంటో కౌంటీ సుపీరియర్‌ కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగిన జయ ఆ తర్వాత కుటుంబంతో అమెరికాలో స్థిరపడ్డారు.

అక్కడే న్యాయ విద్య చదివి న్యాయవాద వృత్తి జీవితం మొదలెట్టారు. ఇటీవల జడ్జిగా ఎంపికైన జయను కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్‌ గవిన్‌ న్యూసమ్‌ శాక్రామెంటో కౌంటీ సుపీరియర్‌ కోర్టు జడ్జిగా తాజాగా నియమించారు.

Kaamya Karthikeyan: 16 ఏళ్లకే ఎవరెస్ట్‌ను అధిరోహించి..మొట్టమొదటి భారతీయ పిన్న వయస్కురాలిగా రికార్డు

 ఇదే కోర్టులో గత రెండేళ్లుగా జయ కమిషనర్‌గా సేవలందిస్తుండటం విశేషం. డెమొక్రటిక్‌ పార్టీ సభ్యురాలైన జయ 2020లో కాలిఫోరి్నయా ఆరోగ్య పరిరక్షణ సేవల విభాగంలో అటారీ్నగా పనిచేశారు.

To Lam: వియత్నాం కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన టో లామ్‌

2018లో కాలిఫోరి్నయా గవర్నర్‌ కార్యాలయంలో అత్యవసర సేవల విభాగంలో సేవలందించారు. శాంటాక్లారా విశ్వవిద్యాలయంలో లా చదివారు. బోస్టన్‌ విశ్వవిద్యాలయంలోని ఇంటర్నేషనల్‌ రిలేషన్స్, ఇంటర్నేషనల్‌ కమ్యూనికేషన్స్‌ విభాగంలో ఎంఏ చేశారు. కుటుంబ కేసులు, తగాదాలను పరిష్కరించడంలో జయ పది సంవత్సరాల అనుభవం గడించారు.

Published date : 24 May 2024 04:09PM

Photo Stories