Skip to main content

Indian Origin Tamils: భారత సంతతి తమిళులకు 200 ఏళ్లు పూర్తి.. తొలి స్టాంపును అందుకున్న రవిశంకర్

శ్రీలంకలో 200 ఏళ్లు పూర్తి చేసుకున్న భారత సంతతి తమిళుల (IOT) స్మారకంగా విడుదల చేసిన తొలి స్టాంపును భారత ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ స్వీకరించారు.
Sri Sri Ravi Shankar Receives First Stamp Commemorating 200 Years of Indian Origin Tamils in Sri Lanka

ఈ స్టాంపును శ్రీలంక తూర్పు ప్రావిన్స్ గవర్నర్ సెంథిల్ తొండమాన్ బహూకరించారు.

దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఐఓటీ కమ్యూనిటీని గౌరవించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ సంద‌ర్భంగా ఐఓటీ కమ్యూనిటీకి అండగా నిలిచిన భారత, శ్రీలంక ప్రభుత్వాలకు తొండమాన్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ స్టాంపు ఐఓటీ కమ్యూనిటీకి గొప్ప చరిత్ర, శ్రీలంకలో వారి సహకారాన్ని గుర్తు చేస్తుంది. 18వ శతాబ్దంలో బ్రిటిష్ వారు తమిళ కార్మికులను తమ ప్లాంటేషన్‌ల‌లో పనిచేయడానికి తీసుకువెళ్లడంతో ఈ కమ్యూనిటీ ఏర్పడింది.

 

Indian Population: భారత్‌లో తగ్గుతున్న హిందూ జనాభా.. ఎంత తగ్గిందంటే..

Published date : 23 May 2024 10:42AM

Photo Stories