G7 Summit 2024: ఇటలీలో ప్రారంభమైన జీ-7 దేశాల సమ్మిట్

ఇటలీలోని అపులియాలో జూన్ 13వ తేదీ జీ-7 దేశాల సమ్మిట్ ప్రారంభమైంది.

ఇటలీలోని అపులియాలో జూన్ 13వ తేదీ జీ-7 దేశాల సమ్మిట్ ప్రారంభమైంది. ఇది మూడురోజుల పాటు జ‌రిగే శిఖరాగ్ర సదస్సు. ఈ సమ్మిట్‌కు తొలిరోజు హాజరైన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ స్వాగతం పలికారు. 
 
జీ7 భేటీకి అమెరికా అధ్యక్షుడు బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్, బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డ సిల్వా, యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్‌ బిన్, జోర్డాన్‌ రాజు అబ్దుల్లా, జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వ‌చ్చారు.

ప్రపంచ నాయకులతో భేటీ అయిన మోదీ గ్లోబల్ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చే ప్రభావవంతమైన పరిష్కారాలను రూపొందించటం, భవిష్యత్తు తరాలకు మెరుగైన ప్రపంచాన్ని సృష్టించడం మా లక్ష్యమ‌ని చెప్పారు.

 

UNSC Non Permanent Members: భద్రతా మండలికి ఎన్నికైన 5 దేశాలు ఇవే..

#Tags