UNSC Non Permanent Members: భద్రతా మండలికి శాశ్వతేతర సభ్యులుగా ఎన్నికైన 5 దేశాలు ఇవే..
Sakshi Education
ఐక్యరాజ్యసమితిలోని ప్రధానమైన భద్రతా మండలికి శాశ్వతేతర సభ్య దేశాల కోటాలో 5 దేశాలు ఎన్నికయ్యాయి.
ఐరాస జనరల్ అసెంబ్లీలో రహస్య బ్యాలెట్ విధానంలో జూన్ 6వ తేదీ జరిగిన ఎన్నికలు జరిగాయి. ఇందులో ఆఫ్రికా, ఆసి యా–పసిఫిక్ ప్రాంతాలకుగాను సొమాలియా, పాకిస్తాన్‌లు, లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంత దేశాలకుగాను పనామా, పశ్చిమ యూరప్, ఇతర దేశాలకుగాను డెన్మార్క్, గ్రీస్‌లు అత్యధిక ఓట్లు సంపాదించాయి.
ఈ దేశాలు 2025 జనవరి నుంచి 2026 డిసెంబర్ 31 వరకు రెండేళ్ల పాటు శాశ్వతేతర సభ్య హోదాలో కొనసాగుతాయి.
Deployment of Weapons: అంతరిక్షంలో ఆయుధాల మోహరింపు నిషేధంపై ఐరాసలో వీగిన రష్యా తీర్మానం
Published date : 07 Jun 2024 12:13PM