Ukraine War: భారత్ మాకు వ్యూహాత్మక భాగస్వామి.. అమెరికా స్పందన ఇదే..
Sakshi Education
రష్యాతో భారత్ మైత్రి బంధం మరింత బలపడుతున్నా సరే తమకు మాత్రం వ్యూహాత్మక భాగస్వామిగానే కొనసాగుతుందని అమెరికా పునరుద్ఘాటించింది.
మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక ఇటీవలే రష్యాలో పర్యటించిన నేపథ్యంలో అమెరికా తాజాగా ఇలా స్పందించింది. వాషింగ్టన్‌లో అమెరికా రక్షణ శాఖ ప్రెస్ సెక్రటరీ ప్యాట్ రైడర్ మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
‘భారత్ ఎప్పటికీ అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామే. దీన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఎదురుచూస్తుంటాం. ఇరుదేశాల సైనిక ఒప్పందాలు, సత్సంబంధాలు కొనసాగుతాయి’ అని స్పష్టంచేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను అమెరికా ఖండిస్తుంది, ఉక్రెయిన్‌కు సాయం చేస్తుందని రైడర్ అన్నారు.
యుద్ధరంగంలో బాంబులు, బుల్లెట్ల నడుమ శాంతి స్థాపన సాధ్యంకాదని ఉక్రెయిన్ దురాక్రమణను ఉద్దేశించి రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ ఇటీవల వ్యాఖ్యానించారు.
Modi in Russia: ఉక్రెయిన్ యుద్ధంపై ద్వైపాక్షిక చర్చలు జరిపిన పుతిన్, మోదీ
Published date : 18 Jul 2024 03:27PM