Israel-Hamas war: ఇజ్రాయెల్‌ దాడుల్లో 36,224 మంది మృతి

ఇజ్రాయెల్‌ ఆర్మీ యథేచ్ఛగా కొనసాగిస్తున్న దాడులతో 24 గంటల వ్యవధిలో గాజాలో 53 మంది మృతి చెందగా మరో 357 మంది గాయపడ్డారని స్థానిక ఆరోగ్య శాఖ తెలిపింది.

వీరిలో ఇద్దరు పాలస్తీనా రెడ్‌ క్రీసెంట్‌ సొసైటీకి చెందిన పారా మెడికల్‌ సిబ్బంది కూడా ఉన్నారని వివరించింది. టాల్‌ అస్‌–సుల్తాన్‌ ప్రాంతంలో జరిగిన బాంబుదాడిలో బాధితులకు సాయం అందించేందుకు వెళ్లగా వీరు గాయపడినట్లు వెల్లడించింది.

తాజా మరణాలతో గతేడాది అక్టోబర్‌ 7వ తేదీ నుంచి ఇప్పటి వరకు కనీసం 36,224 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోగా మరో 81,777 మంది క్షతగాత్రులైనట్లు అంచనా. ఇలా ఉండగా, ఈజిప్టుతో సరిహద్దులు పంచుకుంటున్న గాజా ప్రాంతం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు ఇజ్రాయెల్‌ ఆర్మీ తెలిపింది. 

Landslide: తీవ్ర విషాదం.. కొండచరియల కారణంగా 2,000 మంది మృతి!!

#Tags