India-US Relations: భారత్, అమెరికాల బంధం మరింత బలోపేతం

ఫార్మా, సెమీకండక్టర్లు, కీలక లోహాలు, వర్ధమాన టెక్నాలజీలు తదితర అంశాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, అమెరికా నిర్ణయించుకున్నాయి.
India US agree to strengthen cooperation in pharma, semiconductors

అలాగే, పర్యవరణ అనుకూల సాంకేతికతలను కలిసి అభివృద్ధి చేయడం, క్రిటికల్‌ టెక్నాలజీల్లో భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకోవడం వంటి అంశాలపై చర్చించాయి. భారత్‌–అమెరికా సీఈవో ఫోరం వర్చువల్‌ భేటీలో భాగంగా కేంద్ర వాణిజ్య మంత్రి పియుష్‌ గోయల్, అమెరికా వాణిజ్య మంత్రి జినా రైమండో సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచ్చినట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.

US INDIA Chamber of Commerce: టెక్సాక్‌లో గ్రాండ్‌గా యూఎస్‌ ఇండియా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ 24వ వార్షిక అవార్డ్స్ బాంకెట్‌

ఫోరం సభ్యులు సూచించిన సిఫార్సుల అమలుపై దృష్టి పెట్టాలని సీఈవో ఫోరంనకు రైమండో సూచించారు. అలాగే ఫోరంలో అమెరికాకు చెందిన దిగ్గజాలు హనీవెల్, ఫైజర్, కిండ్రిల్, వయాశాట్‌ చేరికను ప్రకటించారు. సెమీకండక్టర్‌ సరఫా వ్యవస్థ, ఇన్నోవేషన్‌ హ్యాండ్‌షేక్‌ వంటి వేదికల ద్వారా పరిశ్రమ అవకాశాలను అందిపుచ్చుకోవాలని గోయల్‌ పేర్కొన్నారు. 2014లో ఫోరంను పునరుద్ధరించిన తర్వాత నుంచి ఇది ఎనిమిదో సమావేశం. వచ్చే ఏడాది తొలినాళ్లలో తదుపరి భేటీ నిర్వహించనున్నారు. 

U.S. Alleges India: అమెరికా ఆరోప‌న‌ల్లో నిజమెంత?

#Tags