Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. రిక్ట్కర్‌ స్కేల్‌పై 6.7 తీవ్రత

ఇండోనేషియాలోని తలాడ్ దీవుల సమీపంలో భూకంపం సంభవించింది.

రిక్ట్కార్‌ స్కేల్‌పై 6.7 తీవ్రతతో భూకంపం చోటుచేసుకున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. జ‌న‌వ‌రి (మంగళవారం) 9వ తేదీ తెల్లవారుజామున 2.18 నిమిషాలకు భూమి కంపించింది. ఈ భూకంపాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) పోస్ట్ చేసింది. 
ఈ భూకంపం ద్వారా ఎటువంటి ఆస్తీ, ప్రాణ నష్టం జరగనట్లు తెలుస్తోంది. ఎన్‌సీఎస్ తెలిపిన వివరాల ప్రకారం భూకంప కేంద్రం 80 కిలో మీటర్ల లోతులో 4.75 అక్షాంశం, 126.38 రేఖాంశం వద్ద ఉన్నట్లు తేలింది. ఇటీవల జపాన్‌లో సంభవించిన భూకంపం ఆ దేశంలో తీవ్ర నష్టం కలిగించింది.

Earthquake: అరగంట వ్యవధిలో రెండుసార్లు భూకంపం.. ఎక్క‌డంటే..

#Tags