US H1B visa: ఇకపై ఎవరైనా కెనడాలో ఉద్యోగం చేసుకోవచ్చు... అయితే ఈ వీసా ఉంటేనే
దీని ద్వారా అమెరికాలో ఉన్న 75 శాతం భారత హెచ్-1బీ వీసాదారులకు ప్రయోజనం చేకూరనుంది.
ఈ కొత్త పథకం ద్వారా కెనడా ప్రభుత్వం10వేల మంది దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ వీసా హోల్డర్లు కెనడాలో మూడు సంవత్సరాల పాటు పని చేయడానికి అనుమతిస్తుంది. ఈ వీసా హోల్డర్ల కుటుంబ సభ్యుల చదువుకోవచ్చు లేదా దేశంలో పని చేసుకోవచ్చు. ఇందుకు తాత్కాలిక నివాస వీసా, వర్క్ లేదా స్టడీ పర్మిట్ లభిస్తుందని పేర్కొంది. ఇప్పటిదాకా యూఎస్‌లో పని చేసే హెచ్-1 బీ హోల్డర్లు స్పెషాలిటీ ఆక్యుపేషన్ వీసాను ఉపయోగించేవారు.
ఎమోజీలతో యమ డేంజర్... ఈ ఎమోజీలను పంపిస్తే కోర్టు కేసుల్లో అడ్డంగా బుక్కయినట్లే.....
కాగా 2023 వసంవత్సరం జులై 16వతేదీ నాటికి హెచ్1 బి వీసా హోల్డర్‌లు, వారితో పాటు కుటుంబ సభ్యులు కెనడాకు రావడానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని కెనడా ప్రభుత్వం ఈ నెల ప్రారంభంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. టెక్ కంపెనీలు ఇండియా, చైనా వంటి దేశాల నుండి ప్రతి సంవత్సరం పదివేల ఉద్యోగులను నియమించు కుంటాయి.