Amul Milk: విదేశీ మార్కెట్లలో అమూల్ పాలు.. తొలిసారిగా ఇక్క‌డే!

అమూల్ తాజా పాలు వారం రోజుల్లో అమెరికాలో లభించనున్నాయి.
  • అమూల్ తాజా, గోల్డ్, శక్తి, స్లిమ్‌ ఎన్‌ ట్రిమ్‌ వేరియంట్లు అందుబాటులోకి రానున్నాయి.
  • మిషిగాన్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ (ఎంఎంపీఏ)తో భాగస్వామ్యం.
  • న్యూయార్క్, న్యూజెర్సీ, షికాగో, వాషింగ్టన్, డల్లాస్, టెక్సాస్‌లో మొదట అందుబాటులోకి రానున్నాయి.
  • 3-4 నెలల్లో బ్రాండింగ్, మార్కెటింగ్‌పై దృష్టి.

వివరాలు:

  • గుజరాత్‌ కోఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (జీసీఎంఎంఎఫ్‌) ఎండీ జయేన్‌ మెహతా ఈ విషయాన్ని వెల్లడించారు.
  • దశాబ్దాలుగా డెయిరీ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాం, కానీ తాజా పాలను భారత్‌ వెలుపల ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి అని ఆయన తెలిపారు.
  • 108 ఏళ్ల చరిత్ర గల ఎంఎంపీఏతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు.
  • పాల సేకరణ, ప్రాసెసింగ్‌ ఎంఎంపీఏ చేపడుతుంది, మార్కెటింగ్‌ జీసీఎంఎంఎఫ్‌ చూసుకుంటుంది.
  • రాబోయే రోజుల్లో పనీర్, పెరుగు, మజ్జిగ వంటి ఉత్పత్తులను కూడా విదేశాలకు ఎగుమతి చేయాలని జీసీఎంఎంఎఫ్‌ యోచిస్తోంది.
  • జీసీఎంఎంఎఫ్‌ ఇప్పటికే 50 దేశాలకు పాల ఉత్పత్తలను ఎగుమతి చేస్తోంది.

Star Streams: పురాతన నక్షత్రాల ప్రవాహాలను గుర్తించిన గియా టెలిస్కోప్!!

#Tags