Women Teachers Day: మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రీబాయి ఫులే జయంతి

మహాత్మా జ్యోతిబా పూలే సతీమణి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జనవరి 3వ తేదీని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి సంవత్సరం జనవరి 3న అధికారికంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో 50 శాతానికిపైగా మహిళా ఉపాధ్యాయులే ఉండడంతో.. వారికి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి డిసెంబ‌ర్ 2వ తేదీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్సవాలు అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఖర్చులను విద్యాశాఖ బడ్జెట్‌ నుంచి చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉత్సవాల నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖను ఆదేశించారు. 

Important Days: జ‌న‌వ‌రి నెల‌లో జ‌రుపుకునే ముఖ్య‌మైన రోజులు ఇవే..

#Tags