RBI: బంగారం కొనుగోలులో.. ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఆర్‌బీఐ

భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) బంగారం నిల్వల పెంపులో ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచింది.

అక్టోబర్ 2024లో ఆర్‌బీఐ 27 టన్నుల (27000 కిలోలు) పసిడిని జోడించడం ద్వారా దేశం మొత్తం పసిడి నిల్వ 882 టన్నులకు చేరింది. ఇందులో 510 టన్నులు భారత్‌లోనే నిల్వగా ఉన్నాయి. మిగిలిన బంగారం న్యూయార్క్, లండన్ ఇతర దేశాల్లోని గోల్డ్ వాల్ట్‌లలో నిల్వ చేయబడింది.

ఈ సంవత్సరం.. జనవరి నుంచి అక్టోబర్ వరకు భారత రిజర్వ్ బ్యాంక్ మొత్తం 77 టన్నుల బంగారాన్ని జోడించింది. ఇది 2023లో ఇదే కాలంలో గత సంవత్సరం (2022) కంటే ఐదు రెట్లు ఎక్కువ.

ప్రపంచ స్వర్ణ మండలి (WGC) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. కేంద్ర బ్యాంకులు అక్టోబర్ నెలలో 60 టన్నుల బంగారాన్ని కొన్నాయి. ఇది రికార్డ్ స్థాయి.

Droupadi Murmu: మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించ‌నున్న‌ భారత్

భారత్‌ తర్వాత.. టర్కీ (17 టన్నులు), పోలాండ్ (8 టన్నులు) తమ బంగారం నిల్వలను అక్టోబర్‌లో పెంచాయి. ఈ రెండు దేశాలు 2023లో జనవరి నుంచి అక్టోబర్ వరకు 72 టన్నులు, 69 టన్నులు జోడించి, మార్కెట్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించాయి.

#Tags