Helicopter Equipment: భారత్‌కు రూ.9,900 కోట్ల రక్షణ ఉత్పత్తులు
భారత్‌కు సుమారు రూ.9.900 కోట్ల విలువైన హెలికాప్టర్ పరికరాలు, ఇతర సామగ్రి విక్రయానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంగీకారం తెలిపారు.
ఎంహెచ్-60ఆర్ మల్టీ-మిషన్ హెలికాప్టర్ సామగ్రి, సంబంధిత పరికరాల విక్రయానికి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన డిసెంబర్ 2వ తేదీ కాంగ్రెస్‌కు తెలిపారు. ఇవి సమకూరాక భారత్ యాంటీ సబ్మెరీన్ యుద్ధ సామర్ధ్యాలు మరింతగా పెరుగుతాయని, భవిష్యత్తులో ఎదుర్కొనే సవాళ్లను దీటుగా ఎదుర్కొనే సత్తా ఒనగూరనుందని అంచనా.
ఇందులో.. ప్రధాన కాంట్రాక్టర్ లాక్డ్ మార్జిన్ రోటరీ అండ్ మిషన్ సిస్టమ్స్. ఒప్పందంలో భాగంగా 25 మంది కాంట్రాక్టర్ ప్రతినిధులు భారత్‌కు వచ్చి సాంకేతిక సాయం, నిర్వహణలో సాయం అందించనున్నారు. మరో నాలుగు వారాల్లో అధ్యక్ష పదవిని వీడనున్న బైడెన్ ప్రభుత్వం ఈమేరకు కీలక నిర్ణయం తీసుకున్నాడు.
Defence Spending Budget: రికార్డు స్థాయిలో రష్యా రక్షణ బడ్జెట్.. ఎంతంటే..
#Tags