Finance Commission Grants: ఏపీకి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల.. ఎన్ని రూ.కోట్లు అంటే..

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్రం రూ.988.773 కోట్ల నిధులను విడుదల చేసింది.

15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ ఈ నిధులను అందించింది.  

2024-25 ఆర్థిక సంవత్సరానికి అన్‌టైడ్‌ గ్రాంట్లు రూ.395.51 కోట్లు, టైడ్‌ గ్రాంట్లు రూ.593.26 కోట్లు విడుదల చేయడం జరిగింది.

ఈ నిధులు రాష్ట్రంలో అర్హత గల తొమ్మిది జిల్లా పంచాయతీలు, 615 బ్లాక్‌ పంచాయతీలు, 12,853 గ్రామ పంచాయతీలకు అందుతాయి. అన్‌టైడ్‌ గ్రాంట్లు వ్యవసాయం, విద్య, పారిశుధ్యం వంటి 29 స్థానిక అవసరాల కోసం ఉపయోగించబడతాయి. కానీ ఈ నిధులను జీతాలు లేదా ఇతర స్థిర ఖర్చులకు ఉపయోగించకూడదని సూచన ఇచ్చారు.

టైడ్‌ గ్రాంట్లు పారిశుధ్యం, వర్షపు నీటి సంరక్షణ, గృహ వ్యర్థాల శుద్ధి వంటి ప్రధాన అంశాలపై ఖర్చు చేయాలన్నది కేంద్రం నిర్ధారించింది.

Central Government: 28 రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదల.. తెలుగు రాష్ట్రాలకు ఎన్ని రూ.కోట్లు అంటే..!

అలాగే.. ఇటువంటి నిధులను రాజస్థాన్‌ రాష్ట్రానికి కూడా విడుదల చేశారు. అక్కడ రూ.1,267 కోట్లు అందించబడ్డాయి. 

#Tags