Daily Current Affairs in Telugu: ఫిబ్ర‌వ‌రి 1st, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu February 1st 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations

Budget 2023: బ‌డ్జెట్‌లోని ముఖ్యాంశాలు.. సీనియర్‌ సిటిజన్స్‌ పొదుపు పథకం పరిమితి పెంపు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను బుధవారం(ఫిబ్ర‌వ‌రి 1న‌) ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 
సీనియర్‌ సిటిజన్స్‌ పొదుపు పథకం పరిమితి పెంపు
సీనియర్‌ సిటిజన్స్‌లో పొదుపు పథకంలో భాగంగా డిపాజిట్‌ పరిమితి పెంచుతున్నట్లు బడ్జెట్‌ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  ప్రకటించారు. ప్రస్తుతం రూ.15 లక్షల వరకూ ఉన్న పరిమితిని డబుల్‌ చేసి, రూ.30 లక్షలకు పెంచున్నారు.
మహిళల కోసం కొత్త స్కీమ్‌
కేంద్రం ఆజాదీకా అమృత మహోత్సవ్‌లో భాగంగా మహిళల కోసం ప్రత్యేకంగా కొత్త పథకం తీసుకొచ్చింది. మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ను ప్రవేశపెట్టింది. రెండేళ్ల కాలానికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకంలో డిపాజిట్‌పై 7.5 శాతం స్థిర వడ్డీ ఉంటుంది. గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు ఈ పథకంలో డిపాజిట్ చేసుకోవ‌చ్చు.

Economic Survey: ఆర్ధిక సర్వే అంటే ఏమిటి? తొలి సర‍్వే ఎప్పుడు ప్రవేశ పెట్టారో తెలుసా?

Union Budget 2023: గుడ్ న్యూస్‌.. రూ.7 ల‌క్ష‌ల వ‌ర‌కు నో ట్యాక్స్‌.. పూర్తి వివ‌రాలు ఇవే..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వేతన జీవులకు ఊరట కల్పించారు. ఆదాయపన్ను పరిమితిని రూ.5  లక్షల నుంచి  రూ.7 లక్షలకు పెంచారు. అలాగే ఉద్యోగుల పన్ను శ్లాబులను ప్రస్తుతం 6 నుంచి 5కు తగ్గించారు. కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను రాయితీ పరిమితిని రూ.7 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇది పన్ను చెల్లింపుదారులకు, మధ్య తరగతి వారికి ఊరట కల్పించేలా కొత్త ట్యాక్స్‌ విధానంలో అయిదు మేజర్‌ పథకాలను తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. 
కేంద్రం ప్ర‌క‌టించిన కొత్త ట్యాక్స్‌ స్లాబ్ల్స్ ఇవే..
• రూ. 0-3 లక్షలకు ఎలాంటి  పన్ను లేదు
• రూ. 3-6 లక్షల ఆదాయంపై 5 శాతం పన్ను
• రూ. 6-9  లక్షల ఆదాయంపై 10 శాతం పన్ను
• రూ. 9-10 లక్షల ఆదాయంపై 15 శాతం పన్ను
• రూ. 12-15 లక్షల  ఆదాయంపై 20 శాతం
• రూ. 15 లక్షలు దాటితే 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
దీని ప్రకారం ఆదాయం రూ. 7 లక్షలు దాటితే 3 లక్షల ఆదాయం నుంచి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ.9 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి చెల్లించాల్సిన పన్ను రూ.45 వేలు, రూ.15 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి చెల్లించాల్సిన పన్ను రూ.లక్షా 5 వేలుగా ట్యాక్స్‌ ఉండనుంది. అలాగే ఆదాయపు పన్ను రిటర్న్‌ల సగటు ప్రాసెసింగ్ సమయాన్ని 93 రోజుల నుంచి 16 రోజులకు తగ్గించారు. 

Union Budget: 87 నిమిషాల్లో బడ్జెట్‌ ప్రసంగం... ‘పన్ను’ను 51 సార్లు పలికిన నిర్మల


Union Budget 2023: బడ్జెట్ 2023తో.. ధరలు తగ్గేవి.. పెరిగేవి ఏంటో తెలుసా..? 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ 2023-24ని ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇందులో పలు కీలక ప్రకటనలు చేశారు. ఈ బడ్జెట్ ప్రకారం పలు వస్తువుల ధరలు పెరగనుండ‌గా.. మరికొన్నింటి ధరలు తగ్గనున్నాయి.  
పెరుగనున్న వ‌స్తువుల ధ‌రలు..
☛ బ్రాండెడ్‌ దుస్తులు
☛ సిగరెట్లు 
☛ బంగారం, వెండి, డైమండ్స్‌
☛ వాహనాలు టైర్ల ధరలు 
☛ విదేశాల నుంచి దిగుమతి అయ్యే రబ్బరుపై కస్టం డ్యూటీ పెంపు
తగ్గనున్న వ‌స్తువుల ధ‌రలు..
☛ ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు 
☛ టీవీలు, మొబైల్‌ కిచెన్‌ చిమ్మీ ధరలు తగ్గనున్నాయి
☛ పలు వస్తువులపై కస్టమ్‌ డ్యూటీ తగ్గిస్తున్నారు
☛ టీవీ ప్యానెళ్లపై కస్టమ్‌ డ్యూటీ 2.5 శాతానికి తగ్గింపు
☛ లిథియం బ్యాటరీలపై కస్టమ్‌ డ్యూటీనీ 21 శాతం నుంచి 13 శాతానికి తగ్గింపు

Union budget 2023-24 Highlights : దేశ చ‌రిత్ర‌లో తొలిసారిగా.. వీరి కోసం ప్ర‌త్యేక బడ్జెట్‌..

 
Budget 2023: బ‌డ్జెట్ 2023లోని కొత్త ప‌థ‌కాలు ఇవే..
ఈ బ‌డ్జెట్‌లో కేంద్రం ప‌లు కొత్త ప‌థ‌కాలను ప్ర‌వేశ‌పెట్టింది. 
☛ దేఖో ఆప్నా దేశ్ ప‌థ‌కం
☛ ఫార్మ‌రంగ అభివ‌`ద్ధి ప్ర‌త్యేక ప‌థ‌కం
☛ మేకిన్ ఇండియా, మేక్ ఏ వ‌ర్క్ మిష‌న్ ప్రారంభం
☛ మ‌హిళ‌లు, బాలిక‌ల కోసం స‌మ్మాన్ సేవింగ్స్ స‌ర్టిఫికేట్ ప‌థ‌కం
☛ మ‌హిళ‌ల కోసం అధిక వ‌డ్డీతో ప్ర‌త్యేక పొదుపు ప‌థ‌కం
☛ ద‌ళితుల అభివ‌`ద్ధికి ప్ర‌త్యేక ప‌థ‌కం

మహిళలు, వృద్ధులకు ప్రాధాన్య‌త‌..
బడ్జెట్‌లో మహిళలకు, వృద్ధులకు కేంద్రం ప్ర‌త్యేక ప్రాధాన్య‌త‌నిచ్చింది. మహిళల కోసం ప్రత్యేకంగా ఓ పథకాన్ని తీసుకొచ్చింది. అలాగే, సీనియర్‌ సిటిజన్లు డిపాజిట్‌ చేసే గరిష్ఠ పరిమితిని రూ.30 లక్షలకు పెంచింది.
మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. రెండేళ్ల కాలానికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకంలో డిపాజిట్‌పై 7.5 శాతం స్థిర వడ్డీ ఉంటుంది. గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు ఈ పథకంలో డిపాజిట్‌ చేయొచ్చు. పాక్షిక మినహాయింపులకు అవకాశం ఉంటుంది.
సీనియర్‌ సిటిజన్లకు సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీమ్‌ కింద ప్రస్తుతం గరిష్ఠ పరిమితి రూ.15 లక్షల వరకు మాత్రమే ఉంది. దీన్ని రూ.30 లక్షలకు వరకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ పరిమితిని సైతం కేంద్రం సవరించింది. ఇప్పుడున్న 4.5 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంచారు. జాయింట్‌ అకౌంట్‌ కలిగిన వారికి ప్రస్తుతం ఉన్న రూ.9 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచారు. ఈ పథకంపై ప్రస్తుతం 7.10% వడ్డీ లభిస్తుంది.

Union budget 2023-24 Highlights in Telugu : శుభ‌వార్త‌.. మహిళల‌కు పెద్దపీట.. మ‌రిన్ని ప్రత్యేక‌ పథకాలు వీరి కోసం..

యూనియ‌న్ బ‌డ్జెట్‌లోని ముఖ్య‌మైన అంశాలు ఇవే..
☛ పార్ల‌మెంట్‌లో బ‌డ్జెట్ ప్రవేశ‌పెడెతున్న ఆర్థిక‌మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్‌..
☛ ఐదోసారి బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతున్న నిర్మ‌లాసీతారామ‌న్‌..
☛ గ్రీన్ ఎన‌ర్జీకి ప్ర‌భుత్వం తొలి ప్రాధాన్య‌త‌ను ఇస్తోంది..
☛ మ‌త్య‌కారుల‌కు రూ.6 వేల కోట్ల నిధులు కేటాయింపు..
☛ వ్య‌వ‌సారంగంలో స‌వాళ్లు ఎదుర్కొనేందుకు ప్రాధాన్యం
☛ శ్రీఅన్న ప‌థ‌కం ద్వారా చిరుధాన్యాల పంట‌ల‌కు ప్రోత్సాహం
☛ రైతులు, మ‌హిళ‌లు, యువ‌త‌, వెనుక‌బ‌డివారికి ప్రాధాన్య‌త‌
☛ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రాంకు రూ.2 వేల కోట్లు..
☛ దేశవ్యాప్తంగా 157 కొత్త న‌ర్సింగ్ క‌ళాశాల‌ల ఏర్పాటు..
☛ వ‌`ద్ధి రేటు 7 % ఉంటుంద‌ని అంచ‌నా..
☛ మ‌హిళ‌ల కోసం మ‌రిన్ని ప‌థకాలు..
☛ వ్య‌వ‌సాయ అభివ‌`ద్ధికి ప్ర‌త్యేక నిధి ఏర్పాటు..
☛ ఆత్మ‌నిర్భ‌న్ భార‌త్‌తో చేనేత వ‌ర్గాల‌కు చేయూత‌
☛ పీఎం ఆవాస్ యోజ‌న‌కు రూ.79 కోట్లు కేటాయింపు..
☛ కొన‌సాగ‌నున్న ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ..
☛ ఎస్పీ, ఎస్టీ, ఓబీసీల అభివ‌`ద్దే ల‌క్ష్యంగా బ‌డ్జెట్‌..
☛ రైల్వేకు రూ.2.40 ల‌క్ష‌ల‌ కోట్లు కోటాయింపు..
☛ ఏక‌ల‌వ్య పాఠ‌శాల‌కు 30,800 మంది ఉపాధ్యాయులు నియామ‌కం
☛ యువ‌త కోసం నేష‌న‌ల్ డిజిట‌ల్ లైబ్ర‌రీల ఏర్పాటు..
☛ గిరిజ‌న మిష‌న్ కోసం రూ.10 వేల కోట్లు కేటాయింపు..
☛ రాష్ట్రాల‌కు వ‌డ్డీలేని రుణాలు ప‌థ‌కం కోసం రూ.13.7 ల‌క్ష‌ల కోట్లు కేటాయింపు..
☛ క‌రువు ప్రాంత రైతుల‌కు రూ.5,300 కోట్లు కేటాయింపు..
☛ వ్య‌క్తిగ‌త గుర్తింపు కోసం పాన్‌, ఆధార్‌, డీజీ లాక్‌
☛  మొత్తం రూ.75 వేల కోట్లు మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌..
☛ అర్బ‌న్ ఇన్ ఫ్రా ఫండ్ కింద ఏడాది రూ.10 వేల కోట్లు..
☛ 5జీ స‌ర్వీస్ కోసం 100 ల్యాబ్‌లు ఏర్పాటు..
☛ 50 ఏయిర్‌పోర్టులు, పోర్టుల పున‌రుద్ద‌ర‌ణ‌..
☛  ఫిష‌రీస్ కోసం ప్ర‌త్యేక నిధి..
☛ ఈ కోర్టు ప్రాజెక్టుకు రూ.7 వేల కోట్లు..
☛ మూడు కొత్త ఆర్టిఫిషియ‌ల్ ఇంటలిజెంట్ సెంట‌ర్లు
☛ రూ.20 ల‌క్ష‌ల కోట్లు వ్య‌వ‌సాయ రుణాలు
☛ మేక్ ఏ వర్క్ మిష‌న్ ప్రారంభం
☛ గోబ‌ర్ధ‌న్ ప‌థ‌కం కింద 200 బ‌యోగ్యాస్ ప్లాంట్‌లు ఏర్పాటు
☛ కొత్త రైల్వే ట్రాక్‌ల నిర్మాణానికి ప్రాధాన్య‌త‌..
☛ నేష‌న‌ల్ గ‌వ‌ర్నెస్ డేటా పాల‌సీ ద్వారా సుల‌భ‌మైన కేవైసీ..
☛ 2070 నాటికి కార్బన రహిత భారత్‌ లక్ష్యం
☛ త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకకు పెద్ద పీట
☛ కర్ణాటకలోని కరువు ప్రాంతాల అభివృద్ధికి రూ.5300 కోట్ల కేంద్ర సాయం
☛ సివిల్ సర్వెంట్లకు నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు..
☛ పెర‌గ‌నున్న గోల్డ్, సిల్వ‌ర్‌, డైమండ్ ధ‌ర‌లు
☛ గోల్డ్, సిల్వ‌ర్‌, డైమండ్‌పై క‌స్ట‌మ్స్ డ్యూటీ పెంపు
☛ చిరువ్యాపారుల‌కు కూడా పాన్‌కార్డ్ త‌ప్ప‌నిస‌రి
☛ భారీగా త‌గ్గ‌నున్న టీవీ, ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల ధ‌ర‌లు

☛ Union Budget 2023-24 Records : ఆర్థిక మంత్రిగా.. నిర్మలా సీతారామన్ రికార్డులు ఇవే.. దేశ చరిత్రలో అత్యధిక సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన వ్యక్తి ఈయ‌నే..


Asaram Bapu: రేప్‌ కేసులో ఆశారాంకు జీవితఖైదు
స్వయం ప్రకటిత బాబా ఆశారాం బాపూను 2013నాటి అత్యాచారం కేసులో దోషిగా తేల్చి జీవితఖైదు విధిస్తూ గాంధీనగర్‌లోని అదనపు సెషన్స్‌ కోర్టు తీర్పు చెప్పింది. ఈ మేరకు జ‌న‌వ‌రి 31న‌ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. బాధితురాలైన ఆశారాం మాజీ శిష్యురాలికి రూ.50,000 పరిహారం చెల్లించాలని జడ్జి డీకే సోనీ ఆదేశాలిచ్చారు. సూరత్‌కు చెందిన ఒక మహిళ మోతెరానిలోని ఆశారాం ఆశ్రమంలో శిష్యురాలిగా ఉండేది. 2001–2006 కాలంలో తనపై ఆశారాం పలుమార్లు అత్యాచారం చేశాడని 2013లో ఆమె కేసు వేసింది. ఈ కేసులోనే  ఆయనను దోషిగా తేల్చిన కోర్టు తీర్పును జ‌న‌వ‌రి 31వ తేదీకి రిజర్వ్‌చేశారు. తీర్పును గుజరాత్‌ హైకోర్టులో సవాల్‌ చేస్తామని ఆశారాం తరఫు న్యాయవాదులు చెప్పారు. ఈ కేసులో ఆశారాం భార్య లక్ష్మీబెన్, ఆయన కుమార్తె, నలుగురు శిష్యులను నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. 2013లో రాజస్తాన్‌ ఆశ్రమంలో బాలికపై అత్యాచారం కేసులోనూ 81 ఏళ్ల ఆశారాంను దోషిగా తేల్చడంతో ఆయన ఇప్పటికే జోధ్‌పూర్‌ జైలులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు.  

Naba Kisore Das:  ఏఎస్సై కాల్పుల్లో గాయపడిన మంత్రి కన్నుమూత
 
Supreme Court: సుప్రీం జడ్జీలుగా అలహాబాద్, గుజరాత్‌ హైకోర్టు సీజేలు
అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాజేశ్‌ బిందాల్, గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌లను సుప్రీంకోర్టులో జడ్జీలుగా ఎంపికచేయాలని కేంద్రప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం కొలీజియం సిఫార్సుచేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియంలో జస్టిస్‌ కేఎం జోసెఫ్, జస్టిస్‌ ఎస్‌కే కౌల్, జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ అజయ్‌ రస్తోగీ, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సభ్యులుగా ఉన్నారు. కొత్త జడ్జీల ఎంపిక కోసం డిసెంబర్‌ 13న కొలీజియం సమావేశమై ఆ తర్వాత తుది తీర్మానం చేసి ఆ వివరాలను తాజాగా సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
రాజస్తాన్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్, పట్నా హైకోర్టు సీజే జస్టిస్‌ సంజయ్‌ కరోల్, మణిపూర్‌ హైకోర్టు సీజే జస్టిస్‌ పీవీ సంజయ్‌ కుమార్, పట్నా హైకోర్టు జడ్జి జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా, అలహాబాద్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాల పేర్లనూ కొలీజియం సిఫార్సుచేసింది. అన్ని రాష్ట్రాల హైకోర్టులకు సుప్రీంకోర్టులో ప్రాతినిధ్యం ఉండేలా, జడ్జీలుగా సుదీర్ఘ అనుభవం, హైకోర్టుల్లో వారి సీనియారిటీ, భిన్న వర్గాలకు సముచిత స్థానమిస్తూ వీరిని జడ్జీలను ఎంపికచేసినట్లు కొలీజియం తీర్మానం స్పష్టంచేసింది. నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టులో సీజేఐతో కలుపుకుని గరిష్టంగా 34 మంది జడ్జీలు ఉండవచ్చు. ప్రస్తుతం కోర్టులో 27 మంది జడ్జీలు కొనసాగుతున్నారు. 

Andaman Islands: అండమాన్‌లో 21 దీవులకు ‘పరమ వీరచక్ర’ల పేర్లు

Shanti Bhushan: మాజీ న్యాయ మంత్రి శాంతిభూషణ్‌ కన్నుమూత 
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న న్యాయ కోవిదుడు, కేంద్ర మాజీ న్యాయ శాఖ మంత్రి శాంతి భూషణ్‌(97) జ‌న‌వ‌రి 31న‌ ఢిల్లీలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన కుమారులు జయంత్, ప్రశాంత్‌ భూషణ్‌ సైతం న్యాయవాదులుగా పేరొందారు. అణగారిన వర్గాల గొంతుకగా నిలిచిన భూషణ్‌జీ చిరస్మరణీయులంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 1971 లోక్‌సభ ఎన్నికల్లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ రాయ్‌బరేలీ స్థానంలో అక్రమాలకు పాల్పడి గెలిచారని అలహాబాద్‌ హైకోర్టులో కేసు వేసి నెగ్గిన రాజ్‌ నారాయణ్‌ తరఫున శాంతి భూషణ్‌ వాదించారు. ఆ కేసులో ఇందిరాగాంధీ ఓడిపోవడం, ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిగా కోర్టు ప్రకటించడంతో దేశంలో ఎమర్జెన్సీ విధించారు. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (01-07 జనవరి 2023)

BWF Rankings: తొమ్మిదో ర్యాంక్‌లో సింధు 
ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య తాజా ర్యాంకింగ్స్‌లో భారత స్టార్‌ పీవీ సింధు తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇండియా ఓపెన్‌ తర్వాత ఏ టోర్నీలో ఆడని ఆమె మహిళల సింగిల్స్‌లో ఎనిమిది నుంచి తొమ్మిదో ర్యాంక్‌కు పడిపోయింది. సైనా నెహ్వాల్‌ రెండు స్థానాలు ఎగబాకి 26వ ర్యాంక్‌కు చేరింది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌ 16వ ర్యాంక్‌కు పడిపోగా, ప్రణయ్‌ 9వ ర్యాంక్‌లోనే కొనసాగుతున్నాడు. లక్ష్యసేన్‌ ఒక ర్యాంక్‌ మెరుగుపర్చుకొని 11వ స్థానానికి చేరాడు. 

Hockey World Cup: హాకీ ప్రపంచ విజేత జర్మనీ.. ఫైనల్లో బెల్జియంపై గెలుపు
 
Women's T20 Bowling Rankings: టాప్‌ ర్యాంక్‌కు చేరువలో దీప్తి శర్మ 
అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మహిళల టి20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ మూడో ర్యాంక్‌ నుంచి రెండో ర్యాంక్‌కు చేరుకుంది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ముక్కోణపు టి20 టోర్నీలో దీప్తి 9 వికెట్లు పడగొట్టింది. అగ్రస్థానంలో ఉన్న సోఫీ ఎకిల్‌స్టోన్‌ (ఇంగ్లండ్‌)కు దీప్తికి కేవలం 26 రేటింగ్‌ పాయింట్ల వ్యత్యాసమే ఉంది. రేపు దక్షిణాఫ్రికాతో జరిగే ఫైనల్లో భారత స్పిన్నర్‌ తన జోరు కొనసాగిస్తే టాప్‌ ర్యాంక్‌ సాకారమయ్యే చాన్స్‌ ఉంది. టాప్‌–10లో మరో ఇద్దరు భారత బౌలర్లు రేణుక (7వ), స్నేహ్‌ రాణా (10వ) ఉన్నారు. 

U-19 Women’s T20 World Cup: తొలి అండర్‌–19 మహిళల టి20 వరల్డ్‌కప్‌ విజేత భారత్

Volleyball Club World Championship 2023: భారత్‌లో వాలీబాల్‌ క్లబ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ 
భారత్‌లో వరుసగా రెండేళ్లపాటు వాలీబాల్‌ క్లబ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ నిర్వహించనున్నారు. ఈ ఏడాది, వచ్చే ఏడాది రెండు సీజన్లు చాంపియన్‌షిప్‌ జరుగుతుందని అంతర్జాతీయ వాలీబాల్‌ సమాఖ్య (ఎఫ్‌ఐవీబీ) తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో జరిగే వాలీబాల్‌ లీగ్ టోర్నీల్లోని విజేతలతో ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌ నిర్వహిస్తారు. ఒకప్పుడు మనదేశంలో చాంపియన్స్‌ లీగ్‌ టి20 క్రికెట్‌ (ఇప్పుడు లేదు)లాంటిదే ఈ వాలీబాల్‌ టోర్నీ. భారత్‌లో జరుగుతున్న ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ (పీవీఎల్‌) విజేత వాలీబాల్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటుంది. ఈ ఏడాది డిసెంబర్‌ 6 నుంచి 10 వరకు జరుగుతుందని.. వేదిక తదితర వివరాలను పీవీఎల్‌ నిర్వాహకులు ప్రకటిస్తారని ఎఫ్‌ఐవీబీ అధ్యక్షుడు అరి గ్రా తెలిపారు. భారత్‌లో పురుషుల క్లబ్‌ వాలీబాల్‌ టోర్నీ జరగనుండటం ఇదే తొలిసారని ఆయన చెప్పారు. ముందుగా ఈ సీజన్‌ పీవీఎల్‌ ఈ నెల 4న బెంగళూరులో ప్రారంభమవుతుంది.   

వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (01-07 జనవరి 2023) 

#Tags