Naba Kisore Das: ఒడిశాలో ఘోరం.. ఏఎస్సై కాల్పుల్లో గాయపడిన మంత్రి కన్నుమూత
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు విశ్వాసపాత్రుడిగా పేరున్న దాస్ జనవరి 29వ తేదీ ఝార్సుగూడ జిల్లా బజరంగ్‌నగర్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గాందీచౌక్ వద్ద కారు దిగుతుండగా అసిస్టెంబ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్సై) గోపాల్ దాస్ తన తుపాకీతో మంత్రిపై రెండు రౌండ్ల కాల్పులకు తెగబడ్డాడు. తూటాలు ఛాతీలోకి దూసుకెళ్లాయి. తీవ్ర రక్తస్రావంతో స్పృహతప్పిన దాస్‌ను వెంటనే జిల్లా ఆస్పత్రికి, అక్కడి నుంచి హుటాహుటిన ఎయిర్ అంబులెన్స్‌లో భువనేశ్వర్ అపొలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆయన తదిశ్వాస విడిచారు.
Senior actress Jamuna : ప్రముఖ తెలుగు సీనియర్ నటి జమున కన్నుమూత.. ఈమె ప్రస్థానం ఇలా..
గుండె, ఊపిరితిత్తులు దెబ్బ తిని తీవ్ర అంతర్గత రక్తస్రావం జరిగిందని ఆస్పత్రి తెలిపింది. ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.దీనిపై దర్యాప్తునకు సీఎం ఆదేశించారు. ఏఎస్సైని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతన్ని ప్రశ్నిస్తున్నామని, కారణాలు త్వరలోనే తెలుస్తాయని ఉన్నతాధికారులు చెప్పారు. కిశోర్‌దాస్‌కు ఝార్సుగూడ మైనింగ్ ప్రాంతంలో మంచి పట్టుంది. మైనింగ్, రవాణా, హాస్పిటాలిటీ రంగాల్లో వ్యాపారాలున్నాయి. సీఎం తర్వాత అత్యంత ధనికుడు ఆయనేనని చెబుతుంటారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ నుంచి బీజేడీలోకి మారారు. ఏఎస్సై గోపాల్ దాస్ 8 ఏళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నట్టు భార్య జయంతి మీడియాకు చెప్పారు.