Age Reversal: 45 ఏళ్ల వయసులో 18 ఏళ్ల కుర్రాడిగా కనిపించేందుకు.. ఏటా రూ.16 కోట్ల ఖర్చు!
ఫిట్‌నెస్ తరగతులకు వెళ్లడం, ఆహార నియమాలను పాటించడం వంటివి చేస్తూంటారు. యవ్వనంగా కనిపించేందుకు కొందరు కాస్మెటిక్స్‌ను సైతం ఆశ్రస్తుంటారు. అమెరికాకు చెందిన 45 ఏళ్ల ఓ సంపన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బ్రియాన్ జాన్సన్ మాత్రం మరో అడుగు ముందుకు వేశారు. ఎల్లప్పుడూ నవ యవ్వనంతో ఉండేందుకు, వృద్ధాప్య ఛాయలు దరిచేరనీయరాదని వినూత్నమైన, ఖరీదైన దారిని ఎంచుకున్నారు. 45 ఏళ్ల వయస్సులో 18 ఏళ్ల యువకుడిలా కనిపించేందుకు ఏడాదికి రూ.16.30 కోట్లు ఖర్చు పెట్టేందుకు ఈయన సిద్ధమయ్యారని బ్లూమ్‌బర్గ్ కథనం తెలిపింది. 18 ఏళ్ల వయసు్కడికి ఉండే మెదడు, గుండె, ఊపిరితిత్తులు, లివర్, మూత్రపిండాలు, కండరాలు, దంతాలు, చర్మం, వెంట్రుకలు, బ్లాడర్, పురుషాంగం, పురీషనాళం వంటి కీలక అవయవాలు తనకు ఉండాలని కోరుకున్నారు. ఇందుకోసం పేరున్న ఆలివర్ జొల్మాన్(29) అనే రీజనరేటివ్ మెడిసిన్ ఫిజీషియన్‌ను సంప్రదించారు.
Oscar Awards: 22 ఏళ్ల తర్వాత ఆస్కార్‌కు ఇండియన్ మూవీ... ఓ నటుడిని నగ్నంగా నిలబెట్టి మరీ అవార్డు డిజైన్.. ఆ నటుడు ఎవరో తెలుసా..?
ఇద్దరూ కలిసి వయస్సును తగ్గించి, ఆయుర్థాయాన్ని పెంచే అత్యాధునిక వైద్య విధానాలను అధ్యయనం చేశారు. చివరికి జొల్మాన్ నేతృత్వంలో 30 మంది వైద్యులు, నిపుణుల బృందాన్ని సిద్ధం చేశారు. వీరంతా కలిసి 18 ఏళ్ల యువకుడి మాదిరి శారీరక దృఢత్వం, ఊపిరితిత్తుల సామర్థ్యం, 37 ఏళ్ల వ్యక్తి గుండె, 28 ఏళ్ల యువకుడి ఆరోగ్యవంతమైన చర్మాన్ని బ్రియాన్ సొంతమయ్యేందుకు పాటించాల్సిన రోజువారీ ఆహార నియమాలను రూపొందించారు. బ్రియాన్‌పై వీటిని ప్రయోగించి, ఫలితాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటారు. అతడి శరీరంలోని అన్ని అవయవాలు వయస్సు ప్రభావానికి లోనుకాకుండా, యవ్వనంతో ఉండేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఇందులో భాగంగా బ్రియాన్ కోసం ఖరీదైన మెడికల్ సూట్‌ను కూడా రూపొందించారు. బ్రియాన్‌కు ఈ మేరకు వైద్య చికిత్సలు ప్రారంభం అయినట్లు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది.