Union budget 2023-24 Highlights : దేశ చరిత్రలో తొలిసారిగా.. వీరి కోసం ప్రత్యేక బడ్జెట్..
సంప్రదాయ కళాకారులు, హస్తకళాకారులను ఉద్దేశించి ఈ ప్యాకేజీ తీసుకురాబోతున్నట్లు ఆమె వెల్లడించారు. ఎంఎస్‌ఎంసీ(సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ) వాల్యూ చెయిన్‌తో అనుసంధానం చేయడం ద్వారా.. వాళ్ల ఉత్పత్తుల నాణ్యత మెరుగు పర్చడం, క్షేత్రస్థాయిలో అవి వెళ్లే పరిస్థితి మెరుగుపరచడం సాధ్యమవుతుందని, ఆ ఉద్దేశంతోనే ఈ ప్యాకేజీ తీసుకురాబోతున్నట్లు ఆమె ప్రకటించారు. అయితే ఆ ప్యాకేజీ ఏమేర ఉండబోనుందనేది అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
Union Budget 2023-24 live Highlights..
☛ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడెతున్న ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్..
☛ ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలాసీతారామన్..
☛ మత్యకారులకు రూ.6 వేల కోట్ల నిధులు కేటాయింపు..
☛ వ్యవసారంగంలో సవాళ్లు ఎదుర్కొనేందుకు ప్రాధాన్యం..
☛ శ్రీఅన్న పథకం ద్వారా చిరుధాన్యాల పంటలకు ప్రోత్సాహం
☛ రైతులు, మహిళలు, వెనుకబడివారికి ప్రాధాన్యత
☛ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రాంకు రూ.2 వేల కోట్లు..
☛ 157 కొత్త నర్సింగ్ కళాశాలల ఏర్పాటు..
☛ వ`ద్ధి రేటు 7 % ఉంటుందని అంచనా..
☛ మహిళల కోసం మరిన్ని పథకాలు..
☛ వ్యవసాయ అభివ`ద్ధికి ప్రత్యేక నిధి ఏర్పాటు..
☛ ఆత్మనిర్భన్ భారత్‌తో చేనేత వర్గాలకు చేయూత
☛ పీఎం ఆవాస్ యోజనకు రూ.79 కోట్లు కేటాయింపు..
☛ కొనసాగనున్న ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ..
☛ ఎస్పీ, ఎస్టీ, ఓబీసీల అభివ`ద్దే లక్ష్యంగా బడ్జెట్..
☛ రైల్వేకు రూ.2.40 లక్షల కోట్లు కోటాయింపు..
☛ ఏకలవ్య పాఠశాలకు 30,800 మంది ఉపాధ్యాయులు నియామకం
☛ యువత కోసం నేషనల్ డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు..
☛ గిరిజన మిషన్ కోసం రూ.10 వేల కోట్లు కేటాయింపు..
☛ రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలు పథకం కోసం రూ.13.7 లక్షల కోట్లు కేటాయింపు..
☛ కరువు ప్రాంత రైతులకు రూ.5,300 కోట్లు కేటాయింపు..
☛ వ్యక్తిగత గుర్తింపు కోసం పాన్, ఆధార్, డీజీ లాక్
☛ మొత్తం రూ.75 వేల కోట్లు మౌలిక సదుపాయాల కల్పన..
☛ అర్బన్ ఇన్ ఫ్రా ఫండ్ కింద ఏడాది రూ.10 వేల కోట్లు..
☛ 5జీ సర్వీస్ కోసం 100 ల్యాబ్‌లు ఏర్పాటు..
☛ 50 ఏయిర్‌పోర్టులు, పోర్టుల పునరుద్దరణ..
☛ ఫిషరీస్ కోసం ప్రత్యేక నిధి..
☛ ఈ కోర్టు ప్రాజెక్టుకు రూ.7 వేల కోట్లు..
☛ మూడు కొత్త ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ సెంటర్లు
☛ రూ.20 లక్షల కోట్లు వ్యవసాయ రుణాలు
☛ మేక్ ఏ వర్క్ మిషన్ ప్రారంభం
☛ గోబర్ధన్ పథకం కింద 200 బయోగ్యాస్ ప్లాంట్‌లు ఏర్పాటు
☛ కొత్త రైల్వే ట్రాక్‌ల నిర్మాణానికి ప్రాధాన్యత..
☛ నేషనల్ గవర్నెస్ డేటా పాలసీ ద్వారా సులభమైన కేవైసీ..
☛ 2070 నాటికి కార్బన రహిత భారత్ లక్ష్యం
☛ త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకకు పెద్ద పీట
☛ కర్ణాటకలోని కరువు ప్రాంతాల అభివృద్ధికి రూ.5300 కోట్ల కేంద్ర సాయం
☛ సివిల్ సర్వెంట్లకు నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు..