Daily Current Affairs in Telugu: 31 జులై 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌
31 july Current Affairs in Telugu

 1. భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో), న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ సంయుక్తంగా తిరుపతి జిల్లా సతీస్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ప్రయోగించిన‌ పీఎస్‌ఎల్‌వీ సీ–56 ఉపగ్రహ వాహకనౌక  విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. 

2. గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తికి అనుకూలమైన రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్‌ ఎంపికైంది.

3. దేశంలో 2019–21 సంవత్సరాల మధ్య 13.13 లక్షల మంది బాలికలు, మహిళలు కనిపించకుండాపోయారని, అత్యధికంగా మధ్యప్రదేశ్‌ నుంచి, ఆ తర్వాతి స్థానంలో పశ్చిమ బెంగాల్‌ ఉందని  కేంద్రం తెలిపింది. 

☛☛ Daily Current Affairs in Telugu: 29 జులై 2023 క‌రెంట్ అఫైర్స్

4. ప్రపంచ విశ్వ విద్యాలయాల క్రీడల్లో ఆర్చరీ ఈవెంట్‌లో కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో అమన్‌ సైని–ప్రగతి (భారత్‌) జోడీకి పసిడి పతకం లభించింది.

5. జపాన్‌ వేదికగా జరుగుతున్న వరల్డ్ స్విమ్మింగ్  ఛాంపియన్‌షిప్స్‌లో 16 స్వర్ణ పతాకాలతో 26 ఏళ్ల అమెరికా మహిళా స్విమ్మర్‌ కేటీ లెడెకీ చరిత్ర సృష్టించింది

6. భారత క్రికెట్ జట్టు స్టార్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్  అంతర్జాతీయ వన్డేల్లో  26 ఇన్నింగ్స్‌లు తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గిల్‌ ప్రపంచరికార్డు సృష్టించాడు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గిల్‌ ప్రపంచరికార్డు సృష్టించాడు.

☛☛ Daily Current Affairs in Telugu: 28 జులై 2023 క‌రెంట్ అఫైర్స్

#Tags