Skip to main content

Girls and Women Missing Stats: బాలికలు, మహిళలు మిస్సింగ్‌లో మధ్యప్రదేశ్‌ టాప్‌!

దేశంలో 2019–21 సంవత్సరాల మధ్య 13.13 లక్షల మంది బాలికలు, మహిళలు కనిపించకుండాపోయారని కేంద్రం తెలిపింది.
Girls-and-Women-Missing-Stats
Girls and Women Missing Stats

ఇందులో మధ్యప్రదేశ్‌ నుంచి అత్యధికంగా సుమారు 2 లక్షల మంది ఉన్నారని, ఆ తర్వాతి స్థానంలో పశ్చిమ బెంగాల్‌ ఉందని పేర్కొంది. గత వారం పార్లమెంట్‌లో కేంద్ర హోం శాఖ ఇందుకు సంబంధించి నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) నమోదు చేసిన గణాంకాలను వెల్లడించింది. మూడేళ్ల కాలంలో మిస్సయిన మొత్తం 13.13 లక్షల మందిలో బాలికలు 2,51,430 మంది కాగా, 18 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 10,61,648 అని వివరించింది.

☛☛ Women's missing top State in India: మహిళల మిస్సింగ్ కేసుల్లో ఆ రాష్ట్రమే టాప్‌

2019–2021 మధ్య మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 1,60,180 మహిళలు, 38,234 మంది బాలికలు అదృశ్యమయినట్లు ఆ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఉన్న పశ్చిమబెంగాల్‌లో 1,56,905 మంది మహిళలు, 36,606 మంది బాలికలు మిస్సయ్యారని తెలిపింది. ఇదే సమయంలో మహారాష్ట్రలో 1,78,400 మంది మహిళలు, 13,033 మంది బాలికలు.. ఒడిశాలో 70,222 మంది మహిళలు, 16,649 మంది బాలికలు..ఛత్తీస్‌గఢ్‌లో 49,116 మంది మహిళలు, 10,817 మంది బాలికలు కనిపించకుండాపోయారు. 2019–21 మధ్య ఢిల్లీలో 61,054 మంది మహిళలు, 22,919 మంది బాలికలు కనిపించకుండాపోయారు.

☛☛ Child Missing Report: పిల్లల అదృశ్యంలో కర్ణాటక మూడో స్థానం

Published date : 31 Jul 2023 05:35PM

Photo Stories