Daily Current Affairs in Telugu: 28 జులై 2023 కరెంట్ అఫైర్స్
1. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మహేంద్రగిరి ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో గగన్‌యాన్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టం (జీఎంపీఎ‹)తో మరో రెండు హాట్ టెస్ట్‌లను విజయవంతంగా నిర్వహించినట్టు ఇస్రో ప్రకటించింది.
2. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద అర్హులైన 357 మందికి రూ.45.53 కోట్లను ముఖ్యమంత్రి జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి ఖాతాల్లో జమ చేశారు.
3. సీనియర్ ఐఆర్‌ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌కు ఆదాయపు పన్ను విభాగం చీఫ్ కమిషనర్‌గా పదోన్నతి పొందారు.
☛☛ Daily Current Affairs in Telugu: 27 జులై 2023 కరెంట్ అఫైర్స్
4. సిక్కిం రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులైన మహిళలకు ఏడాది పాటు మాతృత్వ సెలవులు, పురుషులకు నెల రోజులపాటు పితృత్వ సెలవులు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రకటించారు.
5. కృత్రిమ మేథ (ఏఐ), కొత్త టెక్నాలజీలపై కలిసి పని చేసే దిశగా డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో భాగమైన ఇండియా ఏఐ, మెటా ఇండియా ఒప్పందం కుదుర్చుకున్నాయి.
6. తీవ్ర వర్షాలు, వరదలతో ప్రభావితమైన గోదావరి జిల్లాలకు అత్యవసర సహాయక చర్యల కోసం రూ. 12 కోట్లు నిధులు మంజూరు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
7. ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు మరింత ప్రోత్సాహాన్ని అందించేందుకు జన్ విశ్వాస్(నిబంధనల సవరణ) బిల్లు-2023కి లోక్‌సభ ఆమోదం తెలిపింది.
8. వన్డే ఫార్మాట్లో వెస్టిండీస్‌పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు.
☛☛ Daily Current Affairs in Telugu: 26 జులై 2023 కరెంట్ అఫైర్స్