Daily Current Affairs in Telugu: 25 అక్టోబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌.
Daily Current Affairs in Telugu

1. భారత్‌ 2030 నాటికి జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ పేర్కొంది.

2. మిసెస్‌ సింగపూర్‌–­2023 పోటీల్లో ఏసియా వరల్డ్‌వైడ్‌ కేటగిరిలో వైఎస్సార్‌ జిల్లా మహిళ విజయారెడ్డి విజేతగా నిలిచారు.

Daily Current Affairs in Telugu: 23 అక్టోబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

3. దేశంలోనే తొలి ప్రైవేట్‌ రాకెట్‌ ప్రయోగ సంస్థ, హైదరాబాద్‌కు చెందిన ‘స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ ఎర్త్‌ ఆర్బిట్‌ రాకెట్‌ విక్రమ్‌–1ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

4. ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్‌ సరబ్‌జోత్‌ సింగ్‌ కాంస్య పతకం సాధించాడు.
మహిళల జూనియర్‌ విభాగం 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన సంయమ్‌ 240.6 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.   

Daily Current Affairs in Telugu: 21 అక్టోబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

5. ఆసియా పారా క్రీడల్లో జీవంజి దీప్తి మహిళల 400 మీటర్ల టి20 కేటగిరీలో పసిడి పతకాన్ని సాధించింది. పురుషుల డిస్కస్‌ త్రో (ఎఫ్‌54/55/56) కేటగిరీలో నీరజ్‌ యాదవ్‌ డిస్క్‌ను 38.56 మీటర్ల దూరాన్ని విసిరి విజేతగా నిలిచి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. పురుషుల 5000 మీటర్ల (టి13 కేటగిరీ) విభాగంలో శరత్‌ శంకరప్ప 20ని:18.90 సెకన్లలో రేసును ముగించి బంగారు పతకాన్ని గెల్చుకున్నాడు.

6. గోవాలో జరుగుతున్న జాతీయ క్రీడల్లో భాగంగా బ్యాడ్మింటన్‌ ఈవెంట్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో షేక్‌ గౌస్‌–పూజ (ఆంధ్రప్రదేశ్‌) జోడీ విజేతగా నిలిచి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.  పురుషుల సింగిల్స్‌ విభాగంలో మన్నేపల్లి తరుణ్‌ స్వర్ణ పతకాన్ని, మహిళల సింగిల్స్‌లో మారెడ్డి మేఘన రెడ్డి కాంస్య పతకాన్ని గెల్చుకున్నారు. 

Daily Current Affairs in Telugu: 20 అక్టోబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

#Tags