AP Policies: ప‌రిశ్ర‌మ‌ల‌కు 21 రోజుల్లోనే అన్ని అనుమ‌తులు: గుడివాడ అమ‌ర్నాథ్‌

విశాఖపట్నంలో ఏపీ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ పాలసీ 2023- 27 వైఎస్‌ఆర్‌ ఏపీ 1 పోర్టల్‌ను మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవన్‌, డైరెక్టర్‌ సృజన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. నూతన ఇండస్ట్రియల్‌ పాలసీ రూపకల్పనలో పారిశ్రామిక వేత్తల ఆలోచనల్ని పరిగణలోకి తీసుకుంటున్నామని అన్నారు.
Gudivada Amarnath

ఎకనామికల్‌ గ్రోత్‌ అనేది ప్రధాన అంశంగా తీసుకున్నట్లు చెప్పారు.  వైఎస్‌ఆర్‌ ఏపీ పోర్టల్‌ ద్వారా 21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతి ఇవ్వడంతో పాటు మూడు వారాల్లోనే పరిశ్రమలకు భూమి కేటాయింపు చేస్తున్నామ‌న్నారు.

చ‌ద‌వండి: సాఫ్ట్‌వేర్ జాబ్ దొర‌క‌డం ఇంత క‌ష్ట‌మా... 150 కంపెనీల‌కు అప్లై చేస్తే...!​​​​​​​
3 కారిడార్లు ఉన్న రాష్ట్రం ఏపీ....

దేశంలో 3 కారిడార్లు ఉన్న రాష్ట్రం ఏపీ.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి దిశగా ముందుకు సాగుదామని అమ‌ర్నాథ్ పిలుపునిచ్చారు. విశాఖ వేదికగా జీ20 సదస్సుకు సర్వం సిద్ధం చేసినట్లు తెలిపారు. విశాఖ‌లో నిర్వ‌హించ‌నున్న సదస్సుకు 40 దేశాల నుంచి 200 మంది దేశ, విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నట్లు చెప్పారు. కాగా, ఇప్పటికే విశాఖలో జీఐఎస్‌ విజయవంతం కాగా జీ20 సదస్సును కూడా అదే రీతిలో నిర్వహించేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

చ‌ద‌వండి: టీఎస్‌పీఎస్ఈ​​​​​​​ పేప‌ర్‌ను విక్ర‌యించుకుంటూ పోయిన నిందితులు?

#Tags