Indian Navy: సోమాలియా పైరేట్ల ఆట కట్టించిన భారత వైమానిక దళం, నావికాదళం
Sakshi Education
భారత వైమానిక దళం, నావికాదళం సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌తో సోమాలియా సముద్రపు దొంగల ఆట కట్టయ్యింది.
- మూడు నెలల క్రితం హైజాక్ చేసిన సరుకు రవాణా నౌక ‘ఎంవీ రూయెన్’ను భారత దళాలు విజయవంతంగా విడిపించాయి.
- 35 మంది సముద్రపు దొంగలను నావికాదళం అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
- నౌకలో బందీలుగా ఉన్న 17 మంది సిబ్బందిని రక్షించారు.
- నౌకలో రూ.8.29 కోట్ల విలువైన 37,800 కోట్ల టన్నుల సరుకు ఉంది.
- భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన సి–17 టాక్టికల్ రవాణా విమానం ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించింది.
- జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా రెండు కాంబాట్ రబ్బరైజ్డ్ రైడింగ్ క్రాఫ్ట్(సీఆర్‌ఆర్‌సీ) బోట్లను, ‘మార్కోస్’ మెరైన్ కమాండోలను ఈ విమానం ద్వారా భారత తీరానికి 2,600 కిలోమీటర్ల దూరంలో ఆరేబియా సముద్రంపైకి క్షేమంగా జారవిడిచారు.
- ‘మార్కోస్’ మెరైన్ కమాండోలు అపూర్వమైన ధైర్యసాహసాలతో సముద్రపు దొంగలను లొంగదీసుకున్నారు.
- మొత్తం ఆపరేషన్ 40 గంటలపాటు జరిగింది.
Mobile Phone: ప్రపంచంలో రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ ఉత్పత్తి దేశం ఇదే..
Published date : 20 Mar 2024 01:32PM