Joint Trade Committee: భారత్-నైజీరియా మధ్య సంయుక్త వాణిజ్య కమిటీ సమావేశం
భారత వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి అమర్‌దీప్ సింగ్ భాటియా నేతృత్వంలోని బృందం ఏప్రిల్ 29, 30 తేదీలలో నైజీరియా రాజధాని అబుజాలో సంయుక్త వాణిజ్య కమిటీ (JTC) సమావేశంలో పాల్గొంది. ఈ సమావేశానికి భారతదేశం నుంచి ఏడుగురు సభ్యులతో కూడిన బృందం నైజీరియాకు వెళ్లింది.
ఈ సమావేశంలో భారతదేశం-నైజీరియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల అభివృద్ధిపై సమగ్ర సమీక్ష జరిగింది. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత విస్తరించేందుకు ఉన్న అవకాశాలను గుర్తించారు.
ముడి చమురు, సహజ వాయువు, ఔషధ రంగం, డిజిటల్ చెల్లింపులు (UPI), స్థానిక కరెన్సీ లావాదేవీల వ్యవస్థ, విద్య, రవాణా, వ్యవసాయం వంటి రంగాలలో సహకారం పెంచేందుకు చర్చించారు.
➤ నైజీరియా ప్రస్తుతం భారతదేశానికి ఆఫ్రికా ఖండంలో రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి.
➤ 2022-23 మధ్యకాలంలో భారత-నైజీరియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం
11.8 బిలియన్ డాలర్లుగా ఉంది.
➤ 2023-24లో ఈ వాణిజ్యం 7.89 బిలియన్ డాలర్లకు తగ్గింది.
➤ సుమారు 135 భారతీయ కంపెనీలు 27 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో నైజీరియాలో వివిధ రంగాలలో పనిచేస్తున్నాయి.
Joint Trade Committee: భారత్, న్యూజిలాండ్‌ల మధ్య జరిగిన 11వ జాయింట్ ట్రేడ్ కమిటీ సమావేశం