HCA Film Awards: ఆర్‌ఆర్‌ఆర్‌కు మరో 4 అంతర్జాతీయ అవార్డులు

అంతర్జాతీయ వేదికలపై ఆర్ఆర్ఆర్ మూవీ సత్తా చాటుతోంది. ఈ సినిమా ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకోవ‌డంతో పాటు, ఓ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయింది.

ప్రపంచవ్యాప్తంగా పలు భాషల అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాను తాజాగా మరో నాలుగు అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరుగుతున్న హాలీవుడ్‌ క్రిటిక్‌ అసోసియేషన్‌ (HCA) అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా నాలుగు కేటగిరీల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా అవార్డులు గెలుచుకుంది. దీంతో ఒకేసారి 4 అవార్డులు అందుకున్న తొలి భారతీయ సినిమాగా రికార్డు సృష్టించింది. బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం, బెస్ట్‌ యాక్షన్‌ ఫిలిం, బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌, బెస్ట్‌ స్టంట్స్‌ కేటగిరీల్లో ఆర్‌ఆర్‌ఆర్‌కు హెచ్‌సీఏ అవార్డులు వరించాయి. ద‌ర్శ‌కుడు రాజమౌళి, సంగీత ద‌ర్శ‌కుడు కీరవాణి, రామ్‌చరణ్‌ ఈ అవార్డులను అందుకున్నారు. 

కాగా బెస్ట్‌ పిక్చర్‌, బెస్ట్‌ డైరెక్టర్‌ కేటగిరీల్లోనూ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా హెచ్‌సీఏ అవార్డుల కోసం నామినేట్‌ అయ్యింది. ఈ రెండు కేటగిరీల్లో ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ ది వన్స్‌ సినిమా అవార్డులు పొందాయి. హాలీవుడ్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులలో పలు విభాగాల్లో విదేశీ చిత్రాలను వెనక్కు నెట్టి మ‌న తెలుగు సినిమా విజయాన్ని అందుకుంది. కేవలం దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా అవార్డ్ అందుకున్న రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌లోని స్టంట్స్ గుర్తించి అవార్డు ఇచ్చిన హెచ్‌సీఏకు కృతజ్ఞతలు తెలిపారు.  

Oscars 2023: ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌లో.. పది భారతీయ చిత్రాలు

#Tags